జార్ఖండ్‌లో ఆకలి చావులు..మరొకరు మృతి

తల్లి మృతదేహాన్నికుమారుడు తన భుజాలపై తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వాస్పత్రి తీరుపై నెజిజన్లు మండిపడుతున్నారు. కాగా, ఇటీవల జార్ఖండ్‌లో సంభవించిన ఆకలి చావుల్లో ఇది రెండోది.

Shiva Kumar Addula | news18india
Updated: June 7, 2018, 5:42 PM IST
జార్ఖండ్‌లో ఆకలి చావులు..మరొకరు మృతి
తల్లి మృతదేహాన్ని భుజాలపై తీసుకెళ్తున్న కుమారుడు
  • Share this:

రాంచీ: జార్ఖండ్‌లో మరో ఆకలి మరణం నమోదయింది. ఛత్రా జిల్లాలో ఆకలితో ఓ మహిళ చనిపోయింది. కడుపు నింపుకునేందుకు బుక్కెడు బువ్వ లేక కన్నుమూసింది. మృతురాలిని స్థానికంగా చెత్తను సేకరించే మహిళ మీనాగా గుర్తించారు.  జార్ఖండ్‌లో వారం రోజుల్లో సంభవించిన రెండో ఆకలి మరణమిది.


స్థానికుల సమాచారం ప్రకారం బీహార్‌లోని గయాకు చెందిన మహిళ, ఆమె కుమారుడు ఇత్ఖోరీలోని ప్రేమ్‌నగర్‌లో జీవనం సాగిస్తున్నారు. చెత్తను సేకరించి .. దాన్ని అమ్ముకోగా వచ్చిన డబ్బులతోనే కడుపు నింపుకునేవారు. తన తల్లి, తాను నాలుగు రోజులుగా ఏమీ తినలేదని మృతుడి కుమారుడు చెప్పాడు.  కొన్ని రోజులుగా చెత్త నుంచి తమకు ఆదాయం రావడం లేదని, ఇంట్లో తినే వస్తువులు ఏమీ లేవని తెలిపాడు.

తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో సోమవారం తన తల్లిని భుజాలపైనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అతడు చెప్పాడు.  కానీ అప్పటికే ఆమె చనిపోయందని డాక్టర్లు ధృవీకరించారని తెలిపాడు. ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే రోగి చనిపోయిందని చత్రా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్‌పీ.సిన్హా తెలిపారు.  పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు.

తల్లి మృతదేహాన్నికుమారుడు తన భుజాలపై తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వాస్పత్రి తీరుపై నెజిజన్లు మండిపడుతున్నారు. కాగా, ఇటీవల జార్ఖండ్‌లో సంభవించిన ఆకలి చావుల్లో ఇది రెండోది. శనివారం గిరిధ్‌ జిల్లాలో ఆకలితో ఓ వ్యక్తి చనిపోయాడు.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2018, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading