news18-telugu
Updated: August 10, 2020, 10:33 PM IST
జగర్నాథ్ మహతో 1995లో పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. ఐతే ఇంటర్లో అడ్మిషన్ తీసుకున్న వేళ స్కూళ్లపై కీలక ప్రకటన చేశారు.
ఆయన ఓ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి..! విద్యాశాఖ మంత్రంటే ఏ డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివారనుకుంటే పొరపాటే. ఆయన చదివింది కేవలం పదో తరగతి మాత్రమే. అవును ఇది నిజం. ఝార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ పదో తరగతి మాత్రమే చదివారు. ఐతే టెన్త్ క్లాస్ చదివిన నేతకు విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తారా? విద్యావ్యవస్థకు ఆయన ఏ విధంగా మేలు చేస్తారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్న జగర్నాథ్.. ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. బొకారో జిల్లా దుమ్రి నియోజకవర్గ పరిధిలోని దేవి మహతో స్మారక్ ఇంటర్ మహా విద్యాలయలో జాయిన్ అయ్యారు.

నేను విద్యాశాఖమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. పదో తరగతి మంత్రి ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. వారందరికీ ఇదే సమాధానం. చదువుకునేందుకు, నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. నేను నా చదువును పూర్తి చేస్తా.
— జగర్నాథ్
జగర్నాథ్ మహతో 1995లో పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. ఐతే ఇంటర్లో అడ్మిషన్ తీసుకున్న వేళ స్కూళ్లపై కీలక ప్రకటన చేశారు. 4,416 కొత్త ప్రభుత్వ పాఠశాలలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
Published by:
Shiva Kumar Addula
First published:
August 10, 2020, 10:24 PM IST