Home /News /national /

JHARKHAND CHIEF MINISTER HEMANT SOREN ANNOUNCED ONE MONTH ADDITIONAL SALARY TO DOCTORS AND MEDICAL WORKERS SSR

CM: వైద్యులకు, వైద్య సిబ్బందికి ఒక నెల అదనపు జీతాన్ని ప్రకటించిన సీఎం

హేమంత్ సోరెన్

హేమంత్ సోరెన్

కరోనా వారియర్స్‌‌కు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ శుభవార్త చెప్పారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో రాత్రింబవళ్లూ తేడా లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న కరోనా వారియర్స్‌కు ప్రోత్సాహకం కింద ఒక నెల జీతాన్ని అదనంగా ఇవ్వనున్నట్లు...

  రాంచీ: దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ తన ప్రతాపాన్ని చూపుతోంది. కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఇప్పటికే 14 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఆసుపత్రుల్లో వైద్యులు, కర్ఫ్యూ ఆంక్షలను సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు రోడ్లపై పోలీసులు.. ఇలా కరోనా వారియర్స్ అందరూ రేయింబవళ్లు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి మరీ పనిచేస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఏమాత్రం రాజీ పడకుండా, నిస్వార్థంగా సేవ చేస్తున్న కరోనా వారియర్స్‌‌కు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ శుభవార్త చెప్పారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో రాత్రింబవళ్లూ తేడా లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న కరోనా వారియర్స్‌కు ప్రోత్సాహకం కింద ఒక నెల జీతాన్ని అదనంగా ఇవ్వనున్నట్లు జార్ఖండ్ సీఎం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జార్ఖండ్‌లో 45,000 యాక్టివ్ కేసులుండగా.. రోజుకు 100కు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో కోవిడ్-19 విధుల్లో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రోత్సాహకం కల్పించాలని సీఎం నిర్ణయించారు. అయితే.. ఫ్రంట్‌లైన్ వర్కర్లు చేస్తున్న సేవలను వెలకట్టలేమని, ఈ ప్రోత్సాహకం వారి సేవలకు సరితూగదని సీఎం చెప్పారు. ఇదిలా ఉంటే.. జార్ఖండ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాణా చందన్ సింగ్ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా హెల్త్ కేర్ సిబ్బందికి ప్రభుత్వం జీతాలే చెల్లించలేదని చెప్పుకొచ్చారు.

  రాణా చందన్ ప్రస్తుతం గుమ్లా జిల్లాలో కోవిడ్-19 శాంపిల్స్ సేకరించే విధుల్లో ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో జీతాలు చెల్లించకుండా ఇలాంటి ప్రోత్సాహకాలు ఎన్ని ప్రకటించినా ప్రయోజనం లేదని ఆయన చెప్పారు. రాంచీ సదర్ హాస్పిటల్‌లో దాదాపు 50 మంది నర్సులు పనిచేస్తున్నారు. ఇన్‌సెంటివ్స్ అందలేదని చాలామంది నర్సులు ఆందోళనకు దిగిన పరిస్థితి.


  రాంచీ సదర్ హాస్పిటల్‌ డిప్యూటీ మెడికల్ సూపరిండెంట్ సబ్యసాచి మండల్ మాట్లాడుతూ.. సదర్ హాస్పిటల్‌లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, 30 మంది కరోనా పేషంట్లకు షిఫ్ట్‌కు ఇద్దరు డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని.. అంతేకాకుండా.. రోజుకు 17కేజీల ఆక్సిజన్ సిలిండర్లు అవసరమవుతుంటే.. అందులో సగం మాత్రమే కేటాయిస్తున్నారని ఆయన చెప్పారు. పేషంట్లకు సరిపడా ఆక్సిజన్ అందక.. ఆక్సిజన్ కొరత ఏర్పడిన పరిస్థితులున్నాయని సబ్యసాచి తెలిపారు.

  ఇది కూడా చదవండి: తెల్లవారుజామున 4.30కు హైవేపై ఓ కారు వెళుతోంది.. టోల్ ప్లాజా దగ్గరకు రాగానే.. పెద్ద ట్విస్టే ఇది..!
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Corona, Covid cases, Covid hospital, Doctors, Jharkhand

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు