జీతభత్యాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ పైలట్స్ మొదటిసారిగా కేంద్రం సహాయం కోరారు. మేనేజ్మెంట్ తమ వినతిని పెడచెవిన పెడుతోందని.. కేంద్రం జోక్యం చేసుకుని తమకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు నేషనల్ ఏవియేషన్ గిల్డ్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్‌కు లేఖ రాసింది.
తమకు రావాల్సిన జీతాలతో పాటు, ఇతరత్రా భత్యాలను వడ్డీతో కలిపి చెల్లించాలని కేంద్రమంత్రిని ఏవియేషన్ గిల్డ్ కోరింది. పరిస్థితులు చూస్తుంటే తమకు తీవ్ర ఆందోళన, నిరాశ కలుగుతోందని లేఖలో వాపోయింది. కాగా, నేషనల్ ఏవియేషన్ గిల్డ్‌లో ఎక్కువమంది జెట్ ఎయిర్వేస్ పైలట్స్ ఉన్నారు. చాలా నెలలుగా సంస్థ వారికి జీతాలు ఇవ్వడం లేదు. బ్యాంకులకు ఆ సంస్థ ఇప్పటికే 1బిలియన్ డాలర్ల అప్పు బకాయి పడి ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అత్యవసర నిధుల కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకులతో జెట్ ఎయిర్వేస్ చర్చలు జరుపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jet Airways, Pm modi, SpiceJet