ఇండియాలో అమెజాన్ చీఫ్... మహాత్మాగాంధీకి నివాళులు అర్పిచిన జెఫ్ బెజోస్

ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇండియాలో పర్యటిస్తున్నారు. మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు.

news18-telugu
Updated: January 15, 2020, 8:19 AM IST
ఇండియాలో అమెజాన్ చీఫ్... మహాత్మాగాంధీకి నివాళులు అర్పిచిన జెఫ్ బెజోస్
మహాత్మాగాంధీకి నివాళులు అర్పిచిన జెఫ్ బెజోస్ (credit - twitter - Jeff Bezos)
  • Share this:
సాధారణంగా వ్యాపార, పారిశ్రామిక వేత్తలు ఇండియాకి వస్తే... రాజకీయ నేతలతో సమావేశమై డీల్స్ కుదుర్చుకొని వెళ్లిపోతుంటారు. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రం... భారతీయుల హృదయం గెలుచుకునే పని చేశారు. మంగళవారం ఇండియాకి వచ్చీ రాగానే... ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కి వెళ్లి మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. ఈ ప్రపంచాన్ని మార్చిన మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పిస్తున్నాను అన్నారు. ఢిల్లీలో ఇవాళ జరిగే... చిన్న, మధ్య తరహా ఆన్‌లైన్ వ్యాపారస్తుల సదస్సు సంభవ్‌కు ఆయన హాజరు కాబోతున్నారు. ఆన్‌లైన్ రిటైలర్ ఉత్పత్తులు, సేవలపై ప్రసంగించనున్నారు. అలాగే బెజోస్... ఇదే వారంలో... బాలీవుడ్ సెలబ్రిటీలతో ముంబైలో సమావేశం కాబోతున్నారు. ఫ్యూచర్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌పై చర్చించనున్నారు.


జెఫ్ బెజోస్ రాకను దేశంలోని చిన్న వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. అమెజాన్ ఇస్తున్న భారీ డిస్కోంట్ల వల్ల... తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా 300 ప్రదేశాల్లో 5లక్షల మంది ట్రేడర్లు ఇవాళ ధర్నా చెయ్యబోతున్నారు. చిన్న వ్యాపారుల సమస్యలు, ఆరోపణల్ని పరిశీలిస్తున్నట్లు కాంపెటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) తెలిపింది.

First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు