• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • JDU LEADERS DAUGHTER FLOATS POLITICAL PARTY DECLARES HER CM CANDIDATURE FOR 2020 BIHAR POLLS NK

బీహార్‌పై కన్నేసిన లండన్ యువతి... సీఎం అవుతానంటూ హల్‌చల్

బీహార్‌పై కన్నేసిన లండన్ యువతి... సీఎం అవుతానంటూ హల్‌చల్

పుష్పం ప్రియా చౌదరి (credit - twitter - Pushpam Priya Choudhary)

Bihar Politics : ఎప్పుడూ మాస్ పాలిటిక్స్‌తో ఉండే బీహార్‌లో ఇప్పుడీ క్లాస్ టచ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎవరా అమ్మాయి... ఎందుకు సీఎం అవుతానంటోంది, అదెలా సాధ్యం ఇలా ఎన్నో ప్రశ్నలు.

 • Share this:
  Bihar Politics : బీహార్‌లోని ఆదివారం ఇంగ్లీష్, హిందీ న్యూస్ పేపర్లలో రొటీన్ న్యూస్‌కి బదులు... ఓ యాడ్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఏంటంటే... పుష్పం ప్రియా చౌదరి అనే యువతి... తాను బీహార్ సీఎం అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటోంది. ఆమెను చూస్తే... ఇండియనేనా అన్న డౌట్ కలుగుతోంది. స్థానిక రాజకీయాల్లో ఎప్పుడూ, ఎక్కడా కనిపించని ఫేస్. మరెందుకు అలా ప్రచారం చేసుకుంటోంది అన్న డౌట్ చాలా మందికి వచ్చింది. వెంటనే అక్కడి మీడియా... వివరాల అన్వేషణ మొదలుపెట్టింది. ఆ క్రమంలో కొన్ని విషయాలు తెలిశాయి. ఆమె పేరు పుష్పం ప్రియా చౌదరి. లండన్‌లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుతోంది. యునైటెడ్ జనతాదళ్ (JDU) మాజీ ఎమ్మెల్సీ వినోద్ చౌదరి కూతురు. బీహార్‌లోని దర్బంగాలో పెరిగింది. ఇప్పుడు మాత్రం లండన్‌లో ఉంది. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఆమె JDU తరపున సీఎం అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.


  ప్రస్థుతం బీహార్‌లో బీజేపీ, జేడీయూ, LGPల సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. ఈ ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కచ్చితంగా గెలవాలని బీజేపీ పక్కా వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో... బీజేపీతో ఉన్నప్పటికీ జేడీయూ కూడా... తన రేటింగ్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్... స్వయంగా పార్టీ పెట్టాలనీ, జేడీయూపై దుమ్మెత్తిపొయ్యాలని రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాత్ బిహారీ కీ పేరుతో... యూత్‌ నుంచీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నారు. ఇలా... ఆల్రెడీ ఉద్దండులైన నేతలు ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే... మధ్యలో ప్రియాచౌదరి ప్రకటన ఆసక్తి రేపుతోంది.


  సాధారణంగా... మన దేశ ప్రజలు... స్థానిక నేతలకే ఓటు వేస్తారు. అమెరికా లాంటి చోట్ల మాత్రం... విదేశీయులకు కూడా ఛాన్సులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లండన్‌లో ఉన్న యువతి... ఉన్నట్టుండి... బీహార్ లాంటి రాష్ట్రంలో సీఎం అభ్యర్థిగా నిలబెడితే... గెలవడం సంగతేమోగానీ... అసలు ఓట్లు ఎన్ని వస్తాయన్నది కూడా సందేహమే. బీహార్‌కు మార్పు అవసరం, బీహార్‌కు రెక్కలు అవసరం. చెత్త రాజకీయాలకు చెక్ పెట్టండి. 2020లో ఎగిరేందుకు, పరిగెత్తేందుకు ప్లూరల్స్‌తో చేతులు కలపండి. ఎందుకంటే బీహార్‌ అభివృద్ధి చెందాలి. ఆ మార్పు సాధ్యమవుతుంది'' అని ట్విటర్‌లో ఆమె కోరుతోంది. మొత్తానికి మహిళా దినోత్సవం రోజున ఆమె వేసిన ప్రకటనలకు మంచి స్పందనే వచ్చింది. అది ఓట్లుగా ఎంతవరకూ మారుతుందో త్వరలో చూద్దాం.  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు