నాపై యాసిడ్ దాడికి కుట్ర... కంటతడి పెట్టుకున్న జయప్రద

2004, 2009లో రాంపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన జయప్రద... 2014లో రాజస్థాన్‌లోని బిజ్‌నూర్ నుంచి ఆర్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

news18-telugu
Updated: April 3, 2019, 7:42 PM IST
నాపై యాసిడ్ దాడికి కుట్ర... కంటతడి పెట్టుకున్న జయప్రద
సభలో కన్నీళ్లు పెట్టుకున్న జయప్రద
  • Share this:
ఉత్తరప్రదేశ్ రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జయప్రద... గతంలో ఇక్కడి నుంచి తనను బలవంతంగా పంపించారంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌పై ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే జయప్రద కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆమెకు మద్దతుగా నినాదాలు చేసిన బీజేపీ మద్దతుదారులు... మీ పోరాటం వెనుక మేముంటాం అంటూ నినాదాలు చేశారు. రాంపూర్ నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రచారం మొదలుపెట్టిన జయప్రద... తన పుట్టినరోజు కానుకగా తనకు బీజేపీ నాయకత్వం రాంపూర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. 2004, 2009లో రాంపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన జయప్రద.. 2014లో రాజస్థాన్‌లోని బిజ్‌నూర్ నుంచి ఆర్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

జయప్రదకు పోటీగా సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆజం ఖాన్ బరిలో ఉన్నారు. 2004లో జయప్రదకు మద్దతుగా రాంపూర్‌లో ప్రచారం చేసిన ఆజం ఖాన్... 2009లో మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తనపై యాసిడ్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించారని... అందుకే తాను రాంపూర్‌ను వదిలి వెళ్లానని జయప్రద అన్నారు. ఈ సారి బీజేపీ తన వెనుక ఉందని జయప్రద... గతంలో మాదిరిగా తనకు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తనకు ఇక్కడి ప్రజలకు సేవ చేసే హక్కు ఉందని అన్నారు. మహిళలను గౌరవించే పార్టీలో ఉండటం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు జయప్రద ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: April 3, 2019, 7:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading