• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • JAYALALITHAA CLOSE AIDE SASIKALA PAID 10 CRORE RUPEES FINE TO COURT MAY RELEASE SOON AK

Sasikala: రూ. 10 కోట్లు కట్టిన శశికళ.. తమిళనాడులో కొత్త చర్చ

Sasikala: రూ. 10 కోట్లు కట్టిన శశికళ.. తమిళనాడులో కొత్త చర్చ

శశికళ (ఫైల్ ఫోటో)

Sasikala: శశికళ జైలు నుంచి బయటకు వస్తే.. తమిళనాడు రాజకీయాల్లో తమకు ఎంతో కొంత అనుకూలంగా ఉంటుందని ఆమెకు సన్నిహితంగా ఉండే నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

  • Share this:
    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కోర్టులో రూ. 10 కోట్లు చెల్లించారు. నాలుగేళ్ల శిక్ష, రూ.10 కోట్ల జరిమానా చెల్లించాలని అప్పట్లో కోర్టు తీర్పు ఇచ్చింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది కారాగారంలో ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె రూ. 10 కోట్లు చెల్లించారు. వచ్చే ఏడాది జనవరి 27 నాటికి శశికళకు కోర్టు విధించిన శిక్షాకాలం పూర్తి కానుంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టుగా యాక్సిస్‌ బ్యాంకు, భారతీయ స్టేట్‌ బ్యాంకులకు చెరో రూ. 5 కోట్ల డీడీలను చెల్లించినట్టు శశికళ తరఫు న్యాయవాది వెల్లడించారు.

    శశికళ తరఫున ఒక రాజకీయ నాయకుడు ఈ మొత్తాన్ని చెల్లించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శశికళ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి జైలు నుంచి విడుదలైతే... ఆమె ప్రభావం తమిళనాడు రాజకీయాలపై ఏ రకంగా ఉంటుందనే అంశంపై అప్పుడే ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. అన్నాడీఎంకే పార్టీలోని నేతల్లో ఇప్పటికీ శశికళకు విధేయులు ఉన్నారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శశికళ మరోసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    శశికళ జైలు నుంచి విడుదలై తమిళనాడు చేరుకుంటే.. తమిళ రాజకీయాలు అందులోనూ అన్నాడీఎంకే రాజకీయాలపై ఆ ప్రభావంపై ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. శశికళ జైలు నుంచి బయటకు వస్తే.. తమిళనాడు రాజకీయాల్లో తమకు ఎంతో కొంత అనుకూలంగా ఉంటుందని ఆమెకు సన్నిహితంగా ఉండే నేతలు భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కోర్టు విధించిన జరిమానా చెల్లించిన శశికళ.. వచ్చే ఏడాది తొందరగా జైలు నుంచి విడుదలవుతారా లేదా అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: