• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • JAYALALITHAA CLOSE AIDE SASIKALA MAY RELEASE ON JANUARY 27 2021 FROM JAIL AK

Sasikala: జైలు నుంచి శశికళ విడుదలపై క్లారిటీ.. అప్పుడే రిలీజ్

Sasikala: జైలు నుంచి శశికళ విడుదలపై క్లారిటీ.. అప్పుడే రిలీజ్

శశికళ (ఫైల్ ఫోటో)

Sasikala Release: అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    Sasikala News: అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా శిక్ష అనుభవిస్తున్న జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలయ్యే అంశంపై క్లారిటీ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 27, 2021న శశికళ జైలు నుంచి విడుదల కావొచ్చు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ అంశంపై బెంగళూరుకు చెందిన న్యాయవారి నరసింహమూర్తి అడిగిన ప్రశ్నకు జైళ్ల శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. అయితే తనకు కోర్టు విధించిన జరిమానా చెల్లించకూడదని శశికళ భావిస్తే.. ఆమె విడుదల ఫిబ్రవరికి వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె పెరోల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ తేదీ మళ్లీ మారొచ్చని తెలుస్తోంది.

    అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే సత్ప్రవర్తన కారణంగా శశికళ ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని ఆమె తరపున లాయర్ రాజా సెంతుర పాండ్యన్ వ్యాఖ్యానించారు. అయితే జైలులో శశికళ అనేక సదుపాయాలు పొందారని.. కర్ణాటక గత ప్రభుత్వం నియమించిన వినయ్ కుమార్ కమిషన్ తేల్చింది. మొత్తానికి వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ.. అదే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఏ రకమైన ప్రభావం చూపుతారన్న దానిపై చాలాకాలం నుంచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: