Home /News /national /

JNU: యూనివర్సిటీలో రామ్​ కే నామ్​ డాక్యుమెంటరీ ప్రదర్శనకు అధికారుల బ్రేక్​.. మత సామరస్యానికి భంగం కలగొచ్చంటూ..

JNU: యూనివర్సిటీలో రామ్​ కే నామ్​ డాక్యుమెంటరీ ప్రదర్శనకు అధికారుల బ్రేక్​.. మత సామరస్యానికి భంగం కలగొచ్చంటూ..

జేఎన్​యూలో విద్యార్థులు

జేఎన్​యూలో విద్యార్థులు

జవహర్‌ లాల్‌ నెహ్రు యూనివర్సిటీ (Jawaharlal Nehru university)లో ‘రామ్‌ కే నామ్‌ (Ram ke naam)’ డ్యాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని ఆ వర్సిటీ  ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై అధికారులు సర్క్యూలర్‌ (Circular) జారీ చేశారు.

ఇంకా చదవండి ...
    జవహర్‌ లాల్‌ నెహ్రు యూనివర్సిటీ (Jawaharlal Nehru university)లో ‘రామ్‌ కే నామ్‌ (Ram ke naam)’ డ్యాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని ఆ వర్సిటీ  ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై అధికారులు సర్క్యూలర్‌ (Circular) జారీ చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ సంతకంతో ఉన్న ఈ సర్క్యూలర్‌లో.. డాక్యుమెంటరీ (Documentary) ప్రదర్శనకు సంబంధించిన ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని, ఈ కారణంగా ప్రదర్శనను నిలిపివేయాల్సిందగా ఆదేశాలను జారీ చేశారు.

    చాలా ఏళ్ల నుంచి ప్రదర్శిస్తున్నాం..

    అధికారులు జారీ చేసిన నోటీస్​లో ఏముందంటే.. కొంత మంది విద్యార్థులు (Students) ‘రామ్‌ కే నామ్‌’ పేరుతో ఉన్న డ్యాక్యుమెంటరీని వర్సిటీ ప్రాంగణంలో ప్రదర్శన చేస్తున్నట్లు.. కొన్ని కరపత్రాలను (Brochures) విడుదల చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి అనధికారిక కార్యకలాపాలు యూనివర్సిటీ క్యాంపస్‌లో మత సామరస్యానికి భంగం (Disturbance of religious harmony) కలిగించవచ్చని సర్క్యూలర్‌లో ప్రస్తావించారు. అయితే దీనికి స్పందించిన వర్సిటీకి చెందిన విద్యార్థి ఒకరు ట్వీట్‌ చేస్తూ.. ‘రామ్‌ కే నామ్‌ చిత్రాన్ని చాలా ఏళ్ల నుంచి ప్రదర్శిస్తున్నాం. ఇది ఒక పాత చిత్రం. యూనివర్సిటీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడండి’ అంటూ ట్వీ్‌ట్‌ చేశారు.

    1992లో రామ్‌ కే నామ్‌..

    డ్యాక్యుమెంటరీ ఫిలిమ్‌ మేకర్‌ ఆనంద్‌ పట్వర్ధన్‌ 1992లో రామ్‌ కే నామ్‌ (ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌) పేరుతో ఓ డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను రూపొందించారు. 1992లో అయోధ్యలో జరిగిన బాబ్రీ మసీద్‌ కూల్చివేత, ఆ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ డ్యాక్యుమెంటరీని తెరకెక్కించారు.



    అయితే తాజాగా జేఎన్‌యూ అధికారులు ఈ డ్యాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను అడ్డుకోవడంపై విమర్శలు వస్తున్నాయని. వర్సిటీలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిసేలా అధికారుల చర్యలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో స్క్రీనింగ్ చేస్తున్న ఈ డ్యాక్యుమెంటరీని ఇప్పుడే కొత్తగా అడ్డుకోవడం ఎంటని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.



    కాగా, గతంలోనూ ఇదే రామ్​ కే నామ్​ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో ఆనంద్‌ పట్వర్ధన్‌ రూపొందించిన ‘రామ్‌ కే నామ్‌’డాక్యుమెంటరీ చిత్రాన్ని గతంలో సోషల్‌ సైన్సెస్‌ భవనంలోని న్యూ సెమినార్‌ హాల్‌లో ప్రదర్శించాలని ఏఐఎస్‌ఏ నాయకులు నిర్ణయించారు. అయితే ఆ హాల్‌ను చిత్ర ప్రదర్శనకు ఇవ్వడం కుదరదని డీన్‌ స్పష్టం చేశారు. దీంతో సోషియాలజీ భవనంలోని సెకండ్‌ ఫ్లోర్‌లోని ఎంఏ ఫస్ట్‌ ఇయర్‌ లెక్చర్‌ హాల్‌లో ప్రదర్శించేందుకు అనుమతి పొందారు. ఆ తర్వాత చిత్ర ప్రదర్శన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు సోషల్‌ సైన్సెస్‌ భవనానికి చేరుకుని ప్రదర్శనను అడ్డుకున్నారు. ఆ సమయంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం ల్యాప్‌టాప్, స్క్రీన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: JNU, Movie, Students

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు