Home /News /national /

JAWAHAR NAVODAYA VIDYALAYAS TO RESUME CLASSES 10 12 IN STATES WHERE SCHOOLS ALLOWED TO REOPEN SK

Navodaya Schools: నవోదయ స్కూళ్ల పున: ప్రారంభం.. కేంద్రం కీలక ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jawahar Navodaya Vidyalaya: శానిటేషన్, పిల్లల తరగతి గదులు, వీరు ఉండే హాస్టల్ రూముల్లో పరిశుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించేలా కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించేలా పలు జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు జారీచేసింది. ఎమర్జెన్సీలు తలెత్తినా ఎటువంటి సమస్యలు రాకుండా స్పందించేలా JNV సిబ్బందిని సిద్ధంచేసింది.

ఇంకా చదవండి ...
    కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలను తెరుస్తున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జవహర్ నవోదయ స్కూళ్లు కూడా తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన రాష్ట్రాల్లో జవహర్ నవోదయ స్కూళ్లను (JNV) నిర్వహించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సరికొత్త ఆదేశాల ప్రకారం 10, 12వ క్లాసుల విద్యార్థులకు జవహర్ నవోదయ స్కూళ్లలో తరగతులు నిర్వహించవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) ను అనుసరించి JNVని పునఃప్రారంభించవచ్చు. కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన ఆదేశాలను ఈ పాఠశాలల్లో తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

    రెసిడెన్షియన్ స్కూళ్లైన వీటిని కో ఎడ్యుకేషన్ స్కూల్స్‌గా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే మార్చ్ లో వేసవి సెలవుల కారణంగా మూతబడ్డ ఈ రెసిడెన్షియల్ స్కూళ్లు ఆతరువాత కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ తెరుచుకోలేదు. దేశవ్యాప్తంగా శరవేగంగా పాకి, విజృంభించిన కరోనా వైరస్ నేపథ్యంలో వీటి నిర్వహణతో పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించిన కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ పాఠశాలలను మూసివేసింది. తాజాగా వీటిని తెరవాలని కేంద్రం ఆదేశించినప్పటికీ, కేవలం తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే ఆయా పిల్లలను స్కూళ్లకు రానివ్వాలని కూడా నిబంధనలు విధించింది. ఇప్పటికే ఈ విద్యార్థుల కోసం ఆన్ లైన్లో పాఠాలు కొనసాగుతుండగా వీరంతా స్కూళ్లకు రాకపోయినా వీరి చదువు కొనసాగేలా కేంద్రం చర్యలు తీసుకుంది. దీంతో విద్యార్థులంతా తప్పనిసరిగా ఫిజికల్ గా క్లాసులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు.

    కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరి..
    మరోవైపు అన్ని రకాల పకబ్డందీ చర్యలు చేపట్టేలా కేంద్రం ఈ నవోదయ స్కూళ్లలో చర్యలు చేపడుతోంది. శానిటేషన్, పిల్లల తరగతి గదులు, వీరు ఉండే హాస్టల్ రూముల్లో పరిశుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించేలా కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించేలా పలు జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు జారీచేసింది. ఎమర్జెన్సీలు తలెత్తినా ఎటువంటి సమస్యలు రాకుండా స్పందించేలా JNV సిబ్బందిని సిద్ధంచేసింది. విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కు వేసుకునే ఉండేలా రెసిడెన్షియల్ పాఠశాలల్లో కఠిన నిబంధనలు పాటించాలని కేంద్ర విద్యాశాఖ గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రస్తుతానికి 10,12వ తరగతి వారికి ఫిజికల్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ మిగతా తరగతుల నిర్వహణపై అతిత్వరలో కీలక ప్రకటన వెలువడనుంది.

    ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతాయి..
    ఇప్పటికే పీరియాడికల్‌గా ఆన్ లైన్ అసెస్మెంట్ నిర్వహణ తరచూ కొనసాగుతుండగా ఆన్ లైన్ క్లాసు హాజరయ్యే అవకాశం లేని విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్, లర్నింగ్ మెటీరియల్స్ అయిన అసైన్మెంట్లు, కొషన్ బ్యాంక్ వంటివి విద్యార్థులకు అందేలా నవోదయ పాఠశాలలు చర్యలు చేపట్టాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (CBSE) కి అనుసంధానంగా పనిచేసే నవోదయ స్కూళ్లన్నీ రెసిడెన్షియల్ పాఠశాలలే కావటంతో వీటి నిర్వహణపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. నవోదయ విద్యాలయ సమితి అనే స్వతంత్ర సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నవోదయ స్కూళ్ల నిర్వహణను చూస్తోంది. కేంద్ర విద్యాశాఖ పరిధిలో ఈ సమితి పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 600 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో లక్షలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Coronavirus, Covid-19, School admissions, Schools reopening

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు