Home /News /national /

JAPAN TO INVEST ABOVE RS 3 LAKH CRORE IN INDIA OVER NEXT 5 YRS SAY PM MODI AFTER ANNUAL INDIA JAPAN SUMMIT WITH FUMIO KISHIDA MKS

PM Modi భారీ ప్రకటన.. భారత్‌లో జపాన్ రూ.3.2లక్షల పెట్టుబడులు.. కిషిడాతో శిఖరాగ్ర సదస్సు

జపాన్ ప్రధాని కిషిడాతో ప్రధాని మోదీ జాయింట్ ప్రెస్ మీట్

జపాన్ ప్రధాని కిషిడాతో ప్రధాని మోదీ జాయింట్ ప్రెస్ మీట్

ప్రధాని మోదీ భారీ ప్రకటన చేశారు. భారత్ లో జపాన్ రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులను పెడుతోందని మోదీ తెలిపారు. జపాన్ ప్రధాని కిషిడాతో సంయుక్త మీడియా సమావేశంలో మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత్-జపాన్ మధ్య 14వ శిఖరాగ్ర సదస్సులో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇరు దేశాల మధ్య చర్చల అనంతరం దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారీ ప్రకటన చేశారు. భారత్ లో జపాన్ రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులను పెడుతోందని మోదీ తెలిపారు. రాబోయే ఐదేళ్ల కాలానికి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.

జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడాతో కలిసి ప్రధాని మోదీ భారత్-జపాన్ ద్వైపాక్షిక 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఇరు దేశాధి నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రపంచం ఇంకా కరోనా ప్రభావం నుంచి బయటపడలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆర్థిక పునరుద్ధరణకు ప్రపంచం ఇంకా అడ్డుంకులను ఎదుర్కొంటోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొత్త సవాల్‌ అని అన్నారు. భారత్‌, జపాన్ భాగస్వామ్యం మరింత బలోపేతం వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంతోపాటు ప్రపంచ స్థాయిలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని ఆకాక్షించారు.

మోదీ-కిషిడా ప్రెస్ మీట్

CM KCR: కేసీఆర్ రాజ్యసభకు పంపబోయేది వీరినేనా? -జాబితాలో వినోద్, మోత్కుపల్లి, పొంగులేటి ఇంకా..


భారత్ లో జపాన్ పెట్టుబడులు ప్రధానంగా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఉద్దేశించినవి. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, మెట్రో ప్రాజెక్టులతో పాటు ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ (DMIC) కోసం జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ బుల్లెట్ రైలు సాంకేతికతపై ఆధారపడిన హై-స్పీడ్ రైల్వే అంశాలను కూడా ఇరు నేతలు చర్చించారు.

భారత్, జపాన్ ఒప్పందాలు

CRPF Day: ఇక కాశ్మీర్‌లో సీఆర్ఎఫ్ బలగాల అవసరం ఉండదు.. ఆర్టికల్ 370 రద్దు విజయమిదే: Amit Shah


శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్-జపాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సైబర్‌ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ షేరింగ్‌ మరియు సహకారం రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలకు భారత్‌లో సాధ్యమైన అన్నివిధాల స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.


Modi-Kishida Meet: మోదీతో జపాన్ ప్రధాని కిషిడా భేటీ -భారత్‌లో 42బిలియన్ డాలర్ల పెట్టుబడులు..


ఈ సందర్భంగా జపాన్ ప్రధాని కిషిడా మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచం అనేక సంక్షోభాలతో అల్లాడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వాములని , ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడి 70 ఏళ్లు పూర్తవుతోందని గుర్తుచేశారు. అంతర్జాయ చట్టం ఆధారంగా ఉక్రెయిన్, రష్యా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని, భార‌త్‌తో పాటు జపాన్ కూడా యుద్ధానికి ముగించేందుకు ప్రయత్నిస్తోందని కిషిడా తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: India, Japan, Pm modi, Russia-Ukraine War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు