Home /News /national /

JAPAN PM FUMIO KISHIDA MEETS PM MODI AT DELHI LIKELY TO ANNOUNCE USD 42BILLION INVESTMENT PLAN IN TWO DAY VISIT MKS

Modi-Kishida Meet: మోదీతో జపాన్ ప్రధాని కిషిడా భేటీ -భారత్‌లో 42బిలియన్ డాలర్ల పెట్టుబడులు..

ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని కిషిడా

ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని కిషిడా

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇరు ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్ లో జపాన్ భారీ పెట్టుబడులు ప్రకటించనుంది.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. (Japan PM Fumio Kishida Meets PM Modi) ఇరు ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, ఇండో-పసిఫిక్ రీజియన్ లో చైనాను నిలువరించే ఎత్తుగడలపైనా రెండు దేశాల నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. జపాన్ ప్రధానిగా ఎన్నికయిన తర్వాత కషిడా భారత్ రావడం ఇదే తొలిసారి. తన రెండు రోజుల పర్యటనలో కిషిడా 14వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో కూడా పాల్గొంటారు.

జపాన్ నుంచి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న కిషీదాకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హైదరాబాద్ హౌజ్ చేరుకున్న జపాన్ ప్రధాని.. భారత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత పర్యటన సందర్భంగా కిషిదా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించవచ్చని జపాన్ మీడియా నివేదించింది. రాబోయే ఐదేళ్లల్లో వివిధ రంగాలకు సంబంధించిన పెట్టుబడులివి.

ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని కిషిడా

25,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే కీలక నిర్ణయం.. ఏ శాఖల్లో అంటే..


భారత్ లో జపాన్ పెట్టుబడులు ప్రధానంగా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఉద్దేశించినవి. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, మెట్రో ప్రాజెక్టులతో పాటు ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ (DMIC) కోసం జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ బుల్లెట్ రైలు సాంకేతికతపై ఆధారపడిన హై-స్పీడ్ రైల్వే అంశాలను కూడా ఇరు నేతలు చర్చిస్తున్నారు. అదే సమయంలో,

భారత్, జపాన్ ప్రధానుల సమావేశం

Covid-19: కరోనా మృత్యువిలయం మళ్లీనా? -ఏడాది తర్వాత చైనాలో తొలి మరణాలు -అమెరికాలో లాక్‌డౌన్స్!


భారత ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా జపాన్ ప్రధాని కిషిడా 2.5 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసే అవకాశం ఉంది. 2014లో ప్రధాని మోదీ, జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే భారత్‌లో 29.35 బిలియన్‌ డాలర్ల ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడులకు అంగీకరించారు. శనివారం నాటి తన పర్యటనలో కిషిదా దానిని 41.94 బిలియన్ డాలర్లకు విస్తరించే అవకాశం ఉంది.


Bullet Train: హైదరాబాద్-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. వయా చిట్యాల-జగ్గయ్యపేట -మంచి లాభం: Uttam


మే-జూన్ మాసంలో జరగనున్న క్వాడ్ లీడర్స్ రెండో ఇన్ పర్సన్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా మోదీని కిషిదా ఆహ్వానించనున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి భారత్ కు ఐదవ అతిపెద్ద భాగస్వామిగా జపాన్ కొనసాగుతోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Delhi, India, Japan, Pm modi, Russia-Ukraine War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు