Janata Curfew : దేశంలో ఐదో కరోనా మరణం... మళ్లీ ముంబైలో...

Janata Curfew | Coronavirus | Covid 19 : దేశంలో కరోనా వైరస్ క్రమంగా ప్రజల్ని కబళిస్తోంది. జనతా కర్ఫ్యూ జరుగుతున్న వేళ ఈ విషాద వార్త తెరపైకి వచ్చింది.

news18-telugu
Updated: March 22, 2020, 11:20 AM IST
Janata Curfew : దేశంలో ఐదో కరోనా మరణం... మళ్లీ ముంబైలో...
నిన్నటి వరకు మొత్తం 7,70,764 టెస్టులు చేశారు.
  • Share this:
Janata Curfew | Coronavirus | Covid 19 : దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ముంబైకి చెందిన 63 ఏళ్ల ఓ ముసలాయన కరోనా వైరస్ వల్ల చనిపోయినట్లు తెలిసింది. మార్చి 19న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన... మార్చి 21న రాత్రి 11.03 గంటలకు మరణించినట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా తెలిపింది. మృతుడికి ఆల్రెడీ డయాబెటిస్ ఉందనీ, హైబీపీ కూడా ఉందని తెలిపింది. అలాగే గుండెకు ఇస్కెమిక్ వ్యాధి కూడా ఉందని వివరించింది. ఇన్ని వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు కరోనా వైరస్ సోకిందనీ, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఆయన చనిపోయారని తెలిపింది.

ఐదో మరణానికి సంబంధించి అధికారిక ప్రకటన


దేశం మొత్తం జనతా కర్ఫ్యూలో పాల్గొన్న సమయంలో... కరోనా కేసుల సంఖ్య 327కి చేరింది. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా 64 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో 52 మందికి వైరస్ సోకింది. ఢిల్లీలో 27, యూపీలో 26, రాజస్థాన్‌లో 23 మందికి వైరస్ ఉంది.

పంజాబ్ అప్రమత్తమై పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు పంజాబ్‌లో ఈ లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటికే రాజస్థాన్‌లో పూర్తిస్థాయి లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నాయి. త్వరలో మహారాష్ట్ర కూడా లాక్ డౌన్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

First published: March 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading