జమ్మూకశ్మీర్‌‌లో పెట్టుబడులు పెట్టండి.. హైదరాబాద్‌లో ఇన్వెస్టర్స్ సమ్మిట్

త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీని ద్వారా సుమారు 50వేల పెట్టుబడులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

news18-telugu
Updated: March 2, 2020, 6:18 PM IST
జమ్మూకశ్మీర్‌‌లో పెట్టుబడులు పెట్టండి.. హైదరాబాద్‌లో ఇన్వెస్టర్స్ సమ్మిట్
హైదరాబాద్‌లో జేకే పెట్టుబడిదారుల సదస్సు
  • Share this:
జమ్మూకాశ్మీర్‌లో పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్‌లో జేకే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. రోడ్‌షో పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు వ్యాపారవేత్తలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు జమ్మూకాశ్మీర్‌లో ఉన్న అనుకూల అంశాలు, ప్రభుత్వ విధానాలను వ్యాపారవేత్తలకు ఈ సందర్భంగా జేకే ప్రభుత్వ అధికారులు వివరించారు. సుందర కాశ్మీరంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సదస్సులో సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ రాష్ట్రం జమ్మూకాశ్మీర్ (అసెంబ్లీతో కూడిన), లద్దాఖ్ కేంద్రప్రాంతపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఆ తర్వాత అన్నిరంగాల్లో జమ్మూకశ్మీర్‌ అభివృద్ధే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రోడ్‌షో పేరిట ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో సదస్సులు నిర్వహించారు. ఈ మూడు రోడ్ షోల ద్వారా సుమారు రూ.3900 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ తర్వాత చెన్నై,అహ్మదాబాద్‌లోనూ ఈ సదస్సులను నిర్వహించబోతున్నారు.

భారతీయ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలపైనా జమ్మూకాశ్మీర్ భారీ ఆశలు పెట్టుకుంది. ఐతే ప్రస్తుతం కొన్ని నగరాల్లో మాత్రమే పెట్టుబడిదారుల సదస్సులు జరుగుతున్నాయి. త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు వస్తాయని అక్కడి అధికారులు ఆశిస్తున్నారు. ఈ సదస్సు ద్వారా సుమారు 50వేల పెట్టుబడులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి:
Published by: Shiva Kumar Addula
First published: March 2, 2020, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading