హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా కమాండర్ హతం

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా కమాండర్ హతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సజ్జద్ హైదర్ కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడని.. ఎంతో మందిని ఉగ్రవాదంవైపు ప్రేరేపించాడని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.

  జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గురువారం కూడా బారాముల్లా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. క్రీరి ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ సజ్జద్ హైదర్ హతమయ్యాడు. హైదర్‌తో పాటు మరో పాకిస్తానీ ఉగ్రవాది ఉస్మాన్, కశ్మీర్‌కు చెందిన వారి అనుచరుడు అనాతుల్లా కూడా మరణించారు. సజ్జద్ హైదర్ కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడని.. ఎంతో మందిని ఉగ్రవాదంవైపు ప్రేరేపించాడని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. అతడి మృతితో కశ్మీరీ ప్రజలకు ఊరల లభించిందని తెలిపారు.


  గడిచిన 4 నాలుగు రోజుల్లో మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో కశ్మీర్ టెర్రరిస్టుల టాప్ 10 జాబితాలో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. మిగిలిన వారి కోసం కూడా గాలిస్తున్నామని పోలీస్ వర్గాలు తెలిపాయి. కశ్మీర్‌ నుంచి సాయుధ బలగాలను కేంద్రం ఉఫసంహరించడం, లష్కరే తోయిబా కమాండర్ సజ్జద్ హైదర్ మరణించడంతో.. లోయలో మళ్లీ అల్లర్లు చెలరేగే అవకాశముంది. ఈక్రమంలో బారాముల్లా సహా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతన కట్టదిట్టం చేశారు అధికారులు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Jammu and Kashmir, Kashmir, Terrorism

  ఉత్తమ కథలు