ఆ మృతదేహం నా కొడుకుదే.. ఆర్మీ జవాన్ తండ్రి ఆవేదన.. అసలేం జరిగిందంటే..

Shakir Manzoor

జమ్మూ కశ్మీర్‌లో కుల్గాం జిల్లాలో (Kulgam district) కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. అయితే ఆ మృతదేహం గతేడాది కనిపించకుండా పోయిన రైఫిల్ మ్యాన్ షకీర్ మంజూర్‌ది (Shakir Manzoor) అని అనుమానిస్తున్నారు.

 • Share this:
  జమ్మూ కశ్మీర్‌లో కుల్గాం జిల్లాలో (Kulgam district) కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. అయితే ఆ మృతదేహం గతేడాది కనిపించకుండా పోయిన రైఫిల్ మ్యాన్ షకీర్ మంజూర్‌ది (Shakir Manzoor) అని అనుమానిస్తున్నారు. షోపియాన్ జిల్లా నుంచి ఉగ్రవాదులచే షకీర్‌ను కిడ్నాప్ చేసి హింసించి, హత్య చేసినట్టుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఆ మృతదేమం తన కొడుకుదేనని షాకీ‌ర్ తండ్రి మంజూర్ వాగై తెలిపారు. అతని జట్టు, కాళ్లు, బ్రాస్లెట్ ఆధారంగా ఆ శరీరం తమ కొడుకుదేనని గుర్తించినట్టుగా చెప్పారు. కొడుకును కోల్పోవడం చాలా బాధకరమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు.

  మోహన్‌పోరా (Mohanpora) గ్రామస్తులు నీలిరంగు టార్పాలిన్ షీట్ కింద మృతదేహాన్ని కనుగని తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. మంజూర్ వాగై వాదనను ధ్రువీకరించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ‘నేను మాత్రమే కాదు.. గ్రామం మొత్తం ఆ మృతదేహం నా కొడుకుదేనని చెప్తుంది. అలా చెప్తున్నవారిలో బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. డీఎన్‌ఏ పరీక్షల (DNA Test) కోసం నమూనాలను తీసుకుంటామని పోలీసులు చెప్పారు. మా మతపరమైన ఆచారాల ప్రకారం మేము మృతదేహాన్ని పాతిపెడతాం’అని మంజూర్ వాగై చెప్పారు. తన కొడుకు కనిపించకుండా పోయినప్పటీ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని మంజూర్ వాగై తెలిపారు. అధికారిక రికార్డుల్లో షకిర్‌ చనిపోలేదని తప్పిపోయినట్లుగానే ఉందన్నారు. షకీర్‌ ఉగ్రవాదులతో కలిసి పోయారా అని చాలా సార్లు ప్రశ్నించారన్నారని చెప్పుకొచ్చారు.

  చీరకట్టుతో వెళ్తే అవమానిస్తారా..? ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన మహిళ.. రెస్టారెంట్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

  షకీర్.. ఇండియాన్ ఆర్మీ.. టెరిటోరియల్ ఆర్మీ( territorial army) యూనిట్‌లోని 162వ బెటాలియన్‌కు చెందిన రైఫిల్ మ్యాన్‌గా పనిచేసేవారు. అతడు గతేడాది ఈద్ జరుపుకోవడానికి షోపియాన్ జిల్లాలో రేషీపోరాలోని తన ఇంటికి వచ్చాడు. అతను ఇంటి నుంచి క్యాంపుకు కారులో వెళ్తుండగా.. అడ్డుకున్న తీవ్రవాదులు, అపహరించుకుపోయినట్టుగా పోలీసులు అనుమానించారు.. ఈ ఘటన తర్వాత పోలీసులు దగ్దమైన అతడి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎంతగా శోధించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. షకీర్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల గ్రామాల్లో అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

  Mutton Curry: హ్యాపీగా దావత్ చేసుకుంటున్నారు.. మటన్ ముక్కల విషయంలో గొడవ.. కట్ చేస్తే..

  ఇక, ఎన్‌కౌంటర్‌లలో మరణించిన మిలిటెంట్ల శవాన్ని అప్పగించకూడదనే విధానాన్ని పోలీసులు కలిగి ఉన్నారని.. అందుకే ప్రతీకారంగా మిలిటెంట్లు షకీర్‌ను చంపి మృతదేహాన్ని అతని కుటుంబానికి తిరిగి ఇవ్వలేదని స్థానికులు నమ్ముతున్నారు. అయితే.. ఫోరెన్సిక్‌ అధికారులు మృతదేహం నుంచి కొన్ని ఆధారాలను సేకరించారని, డీఎన్‌ఏ పరీక్ష చేసిన తర్వాతే మృతదేహం ఎవరిదనేది నిర్ధారిస్తామని పోలీసులు వెల్లడించారు.
  Published by:Sumanth Kanukula
  First published: