Home /News /national /

JAMMU ENCOUNTER ATTACK ON ARMY CAMP IN RAJOURI 2 TERRORISTS KILLED AND 3 SOLDIERS MARTYRED SK

Jammu Encounter: ఆర్మీ క్యాంప్‌లో ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులకు యత్నం.. జమ్మూలో భీకర ఎన్‌కౌంటర్

ఉగ్రవాదుల వేటలో జవాన్లు

ఉగ్రవాదుల వేటలో జవాన్లు

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జమ్మూకాశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    జమ్మూకాశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ (Jammu Encounter) జరిగింది. గురువారం తెల్లవారుజామున రాజౌరీ (Rajouri Encounter)  సెక్టార్‌లో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా.. ముగ్గురు సైనికులు కూడా వీరమరణం చెందారు. రాజౌరి జిల్లా దర్హాల్‌‌లో ఉన్న ఆర్మీ క్యాంపులోకి అనుమానాస్పద ఆత్మాహుతి బృందం (Fidayeen Attack) ప్రవేశించడానికి ప్రయత్నించింది. వారి కదలికలను పసిగట్టిన ఆర్మీ నిఘా బృందం.. ఉగ్రవాదుల అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.   ఈ ఘటన అనంతరం.. ఆ ప్రాంతం మొత్తాన్ని ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో.. వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు.



    జమ్మూ ఎన్‌కౌంటర్ వివరాలు:

    రాజౌరికి 25 కిలోమీటర్ల దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఫిదాయీన్ దాడి జరిగింది. బేస్ ఆపరేటింగ్ ఆర్మీకి చెందిన కంపెనీపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు.

    ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సైనికులు కూడా వీరమరణం పొందారు.  మరో ఐదుగురికి గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు.

    ఆర్మీ క్యాంపు దగ్గర అర్థరాత్రి కొంత కదలిక కనిపించిందని చెబుతున్నారు. అనంతరం ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల నుంచి చాలా సేపు కాల్పులు కొనసాగాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

    అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్ మాట్లాడుతూ..  “కొందరు (ఉగ్రవాదులు) పర్గల్‌లోని ఆర్మీ క్యాంపు కంచెను దాటడానికి ప్రయత్నించారు. సైనికులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.'' అని చెప్పారు.

    ఉగ్రవాదుల దాడిలో గాయపడిన సైనిక సిబ్బందిలో ఒక అధికారి కూడా ఉన్నారు. ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

    16 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ స్వయంగా  దర్హాల్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.



    దర్హాల్ పోలీస్ స్టేషన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆర్మీ క్యాంపుకు అదనపు బలగాలను పంపినట్లు ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు.

    మీడియా కథనాల ప్రకారం.. మరికొందరు ఉగ్రవాదులు ఇక్కడ దాక్కుని ఉన్నారని తెలుస్తోంది. వారి కోసం ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన వెనక లష్కరే తోయిబా హస్తం ఉందని ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

    OMG: తెలంగాణ మహిళపై అమానుషం.. నిద్రలో ఉన్న భార్యపై మూత్ర విసర్జన.. కారణం ఏంటంటే..

    భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జమ్మూకాశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. బుధవారం పుల్వామా జిల్లాలో రోడ్డు పక్కన 25 కేజీల పేలుడు పదార్థాన్ని గుర్తించి... భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఇవాళ ఏకంగా ఆర్మీ బేస్ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి చేసేందుకు యత్నించడంతో.. ఆర్మీ మరింత అప్రమత్తమైంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Encounter, Jammu and Kashmir, Terrorists

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు