PM Modi : జాతినుద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం

Live PM Modi Address The Nation: జమ్మూకాశ్మీర్ దేశంలో అంతర్భాగం అయిన సందర్భంలో ఇవాళ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారోన్న ఉత్కంఠ ఉంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 8:03 PM IST
PM Modi : జాతినుద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
Jammu and Kashmir Issue : దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేస్తున్నానారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కట్టబట్టే ఆర్టికల్ 370, 35Aలను రద్దు చేయడంతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి... జమ్మూకాశ్మీర్, లఢక్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం తెలిసిందే.  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)‌ను కూడా స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాత్రి 8 గం.లకు జాతినుద్దేశించి  చేయనున్న ప్రసంగం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. తన ప్రసంగంలో మోదీ... ఆర్టికల్ 370 రద్దుకు దారితీసిన కారణాలతో పాటు జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం, అక్కడ శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం తీసుకోనున్న నెక్ట్స్ స్టెప్స్... వంటి అంశాల్ని వెల్లడిస్తారని తెలిసింది.



ఇదివరకు నోట్ల రద్దు నిర్ణయ సమయంలో ప్రధాని మోదీ ఇలాగే... జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఒక్కసారిగా దేశ ప్రజలంతా మోదీ చెప్పింది విని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రెండోసారి ఇలాగే జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ... భారత్... శత్రు శాటిలైట్లను కూల్చే సామర్ధ్యాన్ని పొందిందని ప్రకటించి... ఆందర్నీ మరోసారి ఆశ్చర్యంలో పడేశారు. తాజాగా మరోసారి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నట్లు ముందే చెప్పడంతో... ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఇవాళే జాతినుద్దేశించి ప్రసంగిస్తారని తెలిసింది. ముందుగా ప్రకటించిన మేరకు ఇవాళ సాయంత్రం 4 గం.లకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించాల్సి ఉండగా...ఆ తర్వాత దీన్ని రాత్రి 8 గం.లకు వాయిదావేశారు.

ఇప్పటికే జమ్మూకాశ్మీర్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాశ్మీర్‌కి చెందిన ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ... కేంద్రంపై భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా... భారీగా సైన్యాన్ని మోహరించడం వల్ల... పరిస్థితి కంట్రోల్‌లోనే ఉంది.
Published by: Krishna Kumar N
First published: August 8, 2019, 7:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading