హోంమంత్రి అమిత్ షాతో... NSA అజిత్ దోవల్ కీలక భేటీ

ఇటీవలే ఢిల్లీకి తిరిగొచ్చిన ఆయన..కశ్మీర్‌లో పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షాకు వివరించారు.

news18-telugu
Updated: August 19, 2019, 3:46 PM IST
హోంమంత్రి అమిత్ షాతో... NSA అజిత్ దోవల్ కీలక భేటీ
అమిత్ షా, అజిత్ దోవల్
  • Share this:
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో నెలకొన్న పరిణామాలపై అమిత్ షాకు వివరించారు దోవల్. ఈ సమావేశానికి హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గోబా, సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు హాజరయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత NSA అజిత్ దోవల్ 11 రోజుల పాటు కశ్మీర్‌లో పర్యటించారు. సామాన్యుడిలా రోడ్లపై తిరుగుతూ కశ్మీరీలతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఇటీవలే ఢిల్లీకి తిరిగొచ్చిన ఆయన..కశ్మీర్‌లో పరిస్థితులపై హోంమంత్రికి వివరించారు.

మరోవైపు కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కిద్దుకుంటున్నాయి. భద్రతాపరమైన ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రజలు బయటకు వచ్చి తమ తమ పనులు చేసుకుంటున్నారు. ఇవాళ్టి నుంచే జమ్మూకశ్మీర్‌లో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. ఐతే చాలా ప్రాంతాల్లో తక్కువ మంది విద్యార్థులు మాత్రమే క్లాసులకు హాజరైనట్లు తెలుస్తోంది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం బందోబస్తును యథావిధిగా కొనసాగిస్తున్నారు అధికారులు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు