జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా?

జీసీ ముర్ము (File)

జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్మూ రాజీనామాకు సిద్ధమైనట్టు తెలిసింది.

  • Share this:
    జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్మూ రాజీనామాకు సిద్ధమైనట్టు తెలిసింది. సీఎన్ఎన్ న్యూస్‌ 18కు అందిన సమాచారం మేరకు ఆయన రాష్ట్రపతికి తన రాజీనామాను పంపినట్టు తెలిసింది. అయితే, రాష్ట్రపతి కోవింద్ ఆ రాజీనామాను ఆమోదించారా, లేదా అనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జీసీ ముర్ము త్వరలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాగ్ చీఫ్ రాజీవ్ మెహరిషీ  వారంలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో జీసీ ముర్ము కాగ్ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్నట్టు సమాచారం. 2019లో జమ్మూకాశ్మీర్‌ పునర్విభజన చట్టం తీసుకొచ్చిన తర్వాత అది కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. దానికి జీసీ ముర్ము తొలి గవర్నర్ గా నియమితులయ్యారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: