హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఏడాది పాటు కరెంటు, వాటర్ బిల్లుల్లో సగం మాఫీ, బంపర్ ఆఫర్

ఏడాది పాటు కరెంటు, వాటర్ బిల్లుల్లో సగం మాఫీ, బంపర్ ఆఫర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయి, కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌కు ఇది ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుందని మనోజ్ సిన్హా చెప్పారు.

ఏడాది పాటు విద్యుత్, వాటర్ బిల్లుల్లో సగం రాయితీ ఇస్తామని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఈ రోజు ఆయన జమ్మూకాశ్మీర్ కోసం మొత్తం రూ.8750 కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. అందులో కొన్ని పథకాలు కూడా ఉన్నాయి. వ్యాపారులు, వ్యవసాయ పనులు చేసుకునేవారు, సాధారణ పౌరులు ఇలా అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉండేందుకు ఈ ఉద్దీపన ప్యాకేజీని తీసుకొస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. సిన్హా ప్రకటించిన ప్యాకేజీలో రూ.1350 కోట్లు వ్యాపార, దాని అనుబంధమైనవాటిని ప్రోత్సహించేందుకు కేటాయించారు. కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయి, కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌కు ఇది ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుందని మనోజ్ సిన్హా చెప్పారు. తాను ప్రకటించిన ఈ ప్యాకేజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌కు అదనం అని చెప్పారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ కూడా అమలవుతుందన్నారు. దీన్ని కూడా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

‘రుణాలు తీసుకునే ప్రతి వ్యాపారికి ఎలాంటి కండిషన్లు లేకుండా ఆరునెలల పాటు 5శాతం వడ్డీ సబ్వెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇది అమల్లో ఉంటుంది. ఇదో భారీ ఉపశమనం, ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడుతుంది.’ అని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. క్రెడిట్ కార్డు పథకం కింద జమ్మూకాశ్మీర్‌లోని హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీకి ప్రస్తుతం రూ.1 లక్ష వరకు ఇస్తున్నారు. దీన్ని రూ.2 లక్షలకు పెంచుతూ మనోజ్ సిన్హా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి 7 శాతం వడ్డీ సబ్వెన్షన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 1 నుంచి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ యువత, మహిళా పారిశ్రామికవేత్తల కోసం స్పెషల్ డెస్క్‌ను ఏర్పాటు చేయనుంది.

ఇక ఏడాది పాటు కరెంటు, వాటర్ బిల్లుల్లో సగం రాయితీ ఇస్తారు. ‘మేం దీని కోసం రూ.105 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతులు, సాధారణ ప్రజలు, వ్యాపారులు, ఇతరులు అందరికీ ఇది ఉపయోగం. మార్చి 2021 వరకు రుణగ్రహీతలకు స్టాంప్ డ్యూటీ కూడా మినహాయించాం.’ జమ్మూకాశ్మీర్‌లో స్థిరమైన హెల్త్ టూరిజం స్కీమ్‌ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల తాము ఎంతో దెబ్బతిన్నామంటూ కాశ్మీర్ ట్రేడ్ అలయన్స్ (వివిధ రకాల వ్యాపారవర్గాలు) తమను ఆదుకోవాలంటూ ఇటీవల విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మజోన్ సిన్హా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

First published:

Tags: Atma Nirbhar Bharat Abhiyan, Jammu and Kashmir

ఉత్తమ కథలు