హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Jammu and Kashmir: మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: ఫరూక్ అబ్దుల్లా

Jammu and Kashmir: మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: ఫరూక్ అబ్దుల్లా

జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (File)

జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (File)

Article 370: పార్లమెంట్‌లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల (Farm Laws)ను రద్దు చేసేందుకు రైతులు దాదాపు ఏడాది పాటు పోరాడి త్యాగాలు చేసినట్లే, “మా హక్కులను తిరిగి పొందడానికి మేము త్యాగాలకు సిద్ధంగా ఉన్నాము” అని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఆదివారం అన్నారు.

ఇంకా చదవండి ...

  పార్లమెంట్‌ (Parliament)లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రైతులు దాదాపు ఏడాది పాటు పోరాడి త్యాగాలు చేసినట్లే, “మా హక్కులను తిరిగి పొందడానికి మేము త్యాగాలకు సిద్ధంగా ఉన్నాము” అని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ( Farooq Abdullah) ఆదివారం అన్నారు. ఫ‌రూర్ అబ్దుఆల్లా తండ్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా జయంతి సందర్భంగా జరిగిన యువజన సదస్సులో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 మరియు 35A పునరుద్ధరణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. 11 నెలల్లో 700 మందికి పైగా రైతులు మరణించారు. రైతులు (Farmers) త్యాగాలు చేయడంతో కేంద్రం మూడు వ్యవసాయ బిల్లుల (Farm Laws)ను రద్దు చేయవలసి వచ్చింది. అలాగే మన హక్కులను వెనక్కి తీసుకోవడానికి మనం కూడా అలాంటి త్యాగాలు చేయాల్సి రావచ్చ‌ని ఆయన అన్నారు.

  అమిత్‌షాపై విమ‌ర్శ‌లు..

  కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పేరు చెప్పకుండా, అబ్దుల్లా మాట్లాడుతూ, “ఢిల్లీలో, వారు పర్యాటకం ఎలా పెరిగిందో గురించి మాట్లాడతారు. పర్యాటకమే సర్వస్వం అన్నట్లుగా మాట్లాడే వారు.. వారు వాగ్దానం చేసిన 50,000 ఉద్యోగాల సంగతేంటి? ఆ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? నిజానికి, మీరు సర్వీస్‌లో ఉన్నవారిని తొలగిస్తున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు.

  Pakistan: "దయ చూపినందుకు ధన్యవాదాలు".. సౌదీ అప్పుపై పాక్ ప్రధాని ఆర్థిక సలహాదారు ట్వీట్‌


  ఎన్‌సి ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, ప్రావిన్షియల్ ప్రెసిడెంట్ (కశ్మీర్) నాసిర్ అస్లాం వానీ, యూత్ ఎన్‌సి అధ్యక్షుడు సల్మాన్ సాగర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. NC - PDP వివిధ జిల్లాల్లో కార్యక్రమాలను నిర్వహించడంతో J&Kలో రాజకీయ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఇద్దరూ ఇటీవలే పీర్ పంజాల్ ప్రాంత సందర్శనలను ముగించారు.

  ఆర్టికల్‌ 370..

  రాజ్యాంగంలోని 21 భాగంలో ‘తాత్కాలిక, పరివర్తన’ నిబంధనల కింద ఆర్టికల్‌ 370ని పొందుపరిచారు. ఈ అధికరణ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నది. దీని ప్రకారం రక్షణ, ఆర్థిక, విదేశాంగ, సమాచార వ్యవహారాలు మినహా మిగిలిన అన్ని రంగాల్లో రాష్ర్టానికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.

  Katrina Kaif and Vicky Kaushal: కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్లి వేడుకకు వెళ్లాలంటే ఇవి త‌ప్ప‌నిస‌రి..


  పై రంగాలు మినహా ఇతర రంగాలకు సంబంధించిన చట్టాలను రాష్ట్రంలో అమలు చేయాలంటే పార్లమెంటు రాష్ట్ర సమ్మతి తప్పనిసరి. కనీసం రాష్ట్ర సరిహద్దులను మార్చాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే పార్లమెంటు ముందుకు వెళ్లాలి. దేశమంతటా ఎమర్జెన్సీ విధించినా.. కశ్మీర్‌లో విధించే అధికారం కేంద్రానికి లేదు. ఈ ఆర్టిక‌ల్‌ని కేంద్రం 2019లో ర‌ద్దు చేసింది. దీనిపై ఆ ప్రాంత రాజ‌కీయ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 370 ని పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఫ‌రూక్ అబ్దుల్లా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Amit Shah, Article 370, Farm Laws, Jammu and Kashmir, Omar Abdullah

  ఉత్తమ కథలు