Home /News /national /

JAMMU AND KASHMIR ENCOUNTER 7 TERRORISTS KILLED IN SHOPIAN AND PULWAMA TOP COMMANDER AMONG DECEASED SK

కాశ్మీర్‌లో భీకర కాల్పులు.. ఎన్‌కౌంటర్‌లో కీలక నేత సహా ఏడుగురు ఉగ్రవాదులు హతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్‌కౌంటర్‌లో అన్సార్ ఘజాత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఇంతియాజ్ షా కూడా ఉన్నట్లు తెలిసింది. అతడితో పాటు మరో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు

    జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు సాధారణమే. అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ తాజాగా మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన నేత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి షోపియన్ జిల్లాలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. ఓ భవనంలో దాగివున్న ఉగ్రవాదులను లొంగిపోవాల్సిందిగా భద్రతా దళాలు సూచించాయి. కానీ వారు వినకుండా కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో అన్సార్ ఘజాత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఇంతియాజ్ షా కూడా ఉన్నట్లు తెలిసింది. అతడితో పాటు మరో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఎదురుకాల్పుల్లో నలుగురు సైనికులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.

    శుక్రవారం ఉదయం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లాలోనూ సైన్యం, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి టెర్రరిస్టులు తారసపడ్డారు. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ రెండు ఘటనలతో భద్రతా దళాలు అప్రమత్తమ్యాయి. షోపియన్‌తో పాటు పుల్వామాలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. రెండు జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ముందుజాగ్రత్తగా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టదిట్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jammu and Kashmir, Terror attack, Terrorists

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు