Jammu Kashmir Delimitation : కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. 2019లో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చసిన సమయంలో జమ్మూకశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం 2020లో జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేయగా..డీలిమిటేషన్ కమిషన్ తన పదవీ కాలం పూర్తయ్యేందుకు ఒకరోజు ముందే పని పూర్తి చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ సంబంధిత తుది నివేదికపై సంతకాలు చేశారు. కాగా,ఈ కమిటీకి గడువును ఇప్పటికే ఏడాదిపాటు కేంద్రం పొడిగించింది. ఈ ఏడాది మార్చి 6తో గడువు ముగియనుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో రెండు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. ఇక,తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు. అనంతరం దీనిని ప్రజల ముందుకు తెచ్చి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు కోరుతారు. ఆయా మార్పుల అనంతరం గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలు ఏర్పడుతుంది.
ప్రస్తుతం కశ్మీర్ డివిజన్లో 46, జమ్ము డివిజన్లో 37 కలిపి జమ్మూ కశ్మీర్ లోని మొత్తం అసెంబ్లీస్థానాల సంఖ్య 83గా ఉండగా...దీనిని 90 స్థానాలకు పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది. జమ్మూలో 6 స్థానాలు, కశ్మీర్లో 1స్థానం కమిషన్ అదనంగా ప్రతిపాదించింది. చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు 9 సీట్లు కేటాయించింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు సంబంధించి 24 సీట్లు ఖాళీగా ఉండనున్నాయి. కాగా,జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను తర్వలోనే పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హామీ ఇచ్చారు. 2018 జూన్ నుంచి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో లేదు.
ALSO READ Loud Speakers : రాజ్ థాకరే వార్నింగ్..కీలక నిర్ణయం తీసుకున్న ముస్లిం మత పెద్దలు
మరోవైపు, డీలిమిటేషన్ కమిటీ నివేదికపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఇష్టాఇష్టాలు రాజీకీయ పార్టీల అభిప్రాయాలతో సంబంధం లేకుండా బీజేపీ ఆదేశాలతో ఈ డీలిమిటేషన్ జరిగిందని, వారికి తోచిన విధంగా, వారి సొంత నిర్ణయాలు అందులో పొందుపరిచాని. దీన్ని ఎంత మాత్రం అంగీకరించబోమని ముఫ్తీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు అనుసరణే ఈ ముసాయిదా అని ఆమె తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ కమిషన్‌పై తమకు అసలు నమ్మకమే లేదన్నారు. ఈ నివేదికను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Mehbooba Mufti