హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bombs in Buses: బస్సుల్లో బాంబులు.. 8 గంటల్లో రెండో ఘటన.. అక్కడ అసలేం జరుగుతోంది.?

Bombs in Buses: బస్సుల్లో బాంబులు.. 8 గంటల్లో రెండో ఘటన.. అక్కడ అసలేం జరుగుతోంది.?

బస్సులో బాంబు పేలుళ్లు

బస్సులో బాంబు పేలుళ్లు

Udhampur Bomb Blasts: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న జమ్మూకశ్మీర్‌లో పర్యటించాల్సి ఉంది. మొదట అక్టోబరు 30నే ఖరారైనప్పటికీ.. పలు కారణాలతో వాయిదా పడింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో బాంబు పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. 8 గంటల వ్యవధిలో ఒకేచోట రెండు పేలుళ్లు సంభవించాయి. సాధారణంగా కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు, ఎన్‌కౌంటర్‌ల ఘటనలు తరచూ వార్తల్లో చూస్తుంటాం. ఐతే ఈసారి బస్సుల్లో బాంబులు పేలడం చర్చనీయాంశమైంది. ఉదంపూర్ (Udhampur) జిల్లాలో ఎనిమిది గంటల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. మొదట బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో దుమేల్ చౌక్‌లో పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది. ఈ పెట్రోల్ పంపు ముందు భారత సైన్యం (Indian Army) చెకింగ్ పాయింట్ కూడా ఉంది. పేలుడు జరిగిన వెంటనే ఆర్మీ సిబ్బంది పరుగెత్తికెళ్లారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి బస్సు పైకప్పుడు దెబ్బతింది. పెట్రోల్ పంప్ వద్ద పార్క్ చేసి ఉన్న మరికొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఘటన అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు.

  Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని హత్తుకుని ఏడ్చేసిన బాలిక.. వైరల్ వీడియో..

  పేలుడు జరిగిన బస్సు బసంత్‌గఢ్ నుంచి ఉదంపూర్‌కు వచ్చిందని ఆర్మీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి పెట్రోల్ పంపు వద్దే ఉంది. మరుసటి రోజు ఉదయం మళ్లీ బసంత్‌గఢ్‌కు బయలుదేరాల్సి ఉంది. కానీ అంతకు ముందే బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఉదంపూర్-రియాసి రేంజ్ డీఐజీ సులేమాన్ తెలిపారు. ఇందులో ఉగ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌ను కూడా విచారిస్తున్నట్లు వెల్లడించారు.

  లేడీ పోలీస్ నన్ను హింసిస్తుంది..’.. పోలీసు స్టేషన్ లో రచ్చచేసిన లాయర్..వీడియో వైరల్..

  ఈ ఘటన జరిగిన 8 గంటల తర్వాత అచ్చం అలాగే మరో పేలుడు సంభవించింది. ఉదంపూర్ పాత బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని డీఐజీ సులేమాన్ వెల్లడించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి.. ఉదంపూర్‌ బస్టాండ్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు.

  కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అక్టోబర్ 4న జమ్మూకశ్మీర్‌లో పర్యటించాల్సి ఉంది. మొదట అక్టోబరు 30నే ఖరారైనప్పటికీ.. పలు కారణాలతో వాయిదా పడింది. ఆయన పర్యటనకు ముందు జమ్మూకాశ్మీర్‌లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకోవడంతో.. భద్రతా దళాలు అప్రమత్తమ్యాయి. ఉదంపూర్‌లో భారీగా మోహరించిన బలగాలు.. అడుగడుగునా తనిఖీలు చేపట్టాయి. బస్సుల్లోకి బాంబులు ఎలా వచ్చాయి? బస్టాండ్‌కి వచ్చిన తర్వాత పెట్టారా? లేదంటే వేరొక ప్రాంతాల్లో ఉండగా పెట్టారా? అనే వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. బస్టాండ్‌తో పాటు ఆ బస్సు ప్రయాణించే మార్గంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bomb blast, Jammu and Kashmir

  ఉత్తమ కథలు