హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఎల్‌వోసీలో భీకర కాల్పులు...13 మంది ఉగ్రవాదులు హతం

ఎల్‌వోసీలో భీకర కాల్పులు...13 మంది ఉగ్రవాదులు హతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోమవారం ఉదయం రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పెద్ద మొత్తంలో ఆయుధాలు కలిగిన ఉన్న ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చాయి. ఆ తర్వాత ఎల్‌వోసీ వెంబడి మేండర్ సెక్టార్లో మరో 10 మంది టెర్రరిస్టులను చంపేశాయి.

    జమ్మూకాశ్మీర్‌లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మేండర్-పూంచ్ ప్రాంతంలో ఎల్‌వోసీ వెంబడి భీకర కాల్పులు జరిగాయి. భారత దళాల కాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మే 28 నుంచి ఎల్‌వోసీ వెంబడి ఇండియన్ ఆర్మీ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ చేపట్టింది. పాక్ నుంచి భారత్‌లోకి చొరబడేందు ఉగ్రవాదులు యత్నిస్తున్నారన్న నిఘ వర్గాల సమాచారంతో.. భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సోమవారం కూంబింగ్ చేస్తుండగా కలాల్ గ్రామంలో ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సోమవారం ఉదయం రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పెద్ద మొత్తంలో ఆయుధాలు కలిగిన ఉన్న ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చాయి. ఆ తర్వాత ఎల్‌వోసీ వెంబడి మేండర్ సెక్టార్లో మరో 10 మంది టెర్రరిస్టులను చంపేశాయి. మొత్తంగా ఇవాళ ఒక్కరోజే 13 మందిని హతమార్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Encounter, Jammu and Kashmir, Jammu kashmir, Terrorism

    ఉత్తమ కథలు