JALLIANWALA BAGH MEMORIAL PARK INAUGURATED GOVT PUNJAB AMRITSAR EVK
Jallianwala Bagh Massacre: అమరుల స్మరణలో: జలియన్ వాలాబాగ్లో స్మారక పార్కు ప్రారంభం
జలియన్ వాలాబాగ్ పార్క్ ప్రారంభిస్తున్న పంజాబ్ సీఎం
స్వాతంత్ర పోరాటంలో ఓ నెత్తుటి అధ్యాయంగా మిగిలిని ఘటన జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ మారణకాండలో అసువులు బాసిన అమరుల స్మారకార్థం పంజాబ్ ప్రభుత్వం జలయన్వాలాబాగ్లో స్మారక పార్కును ఏర్పాటు చేసింది.
భారత స్వాతంత్య్ర పోరాటంలో 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్లో జరిగిన ఘటన చేదుజ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ ఘటనలో అసువుల బాసిన వారికి నివాళిగా పంజాబ్ ప్రభుత్వం శతవర్ధంతి స్మారక పార్కును ఏర్పాటు చేసింది. కానీ వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 1.5 ఎకరాల్లో 3.5 కోట్ల వ్యయంతో ఈ స్మారక పార్కును నిర్మించారు.
ఆ రోజు ఏం జరిగింది..
1914–18 మధ్య సాగిన మొదటి ప్రపంచ యుద్ధంలో భారత దేశం సహకరిస్తే స్వయం పాలనకు వీలు కల్పిస్తామని బ్రిటీష్ పాలకులు ఇచ్చిన మాటను తప్పారు. అంతే కాకుండా మొదటి ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా గాయపడినవారు పంజాబీలు అధికం. యుద్ధానంతరం దేశంలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండంతో వాటిని అణచి వేయడానికి బ్రిటీష్ పాలకులు రౌలట్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంకింద పౌరులను ఏ చిన్న అనుమానం కలిగితే విచారణ లేకుండా జైల్లో బంధించేవారు. ఈ సమయంలోనే ఏప్రిల్ 13, 1919 ఆదివారం రోజున అమృత్సర్ పట్టణంలో ఉన్న జలియన్ వాలా బాగ్ అనే తోటలో సిక్కులకు ఎంతో ఇష్టమైన వైశాఖి పండుగ వేడుకలు నిర్వహించుకొనేందుకు 20వేల మంది సిక్కులు, హిందూ, ముస్లింలు సమావేశమయ్యారు. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోటకు చుట్టూ గోడలు, చిన్నచిన్న ద్వారాలు మాత్రమే ఉన్నాయి. వైశాఖి పండుగ సందర్భంగా సమావేశమయినప్పటికీ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారు. రౌలత్ చట్టాన్ని రద్దు చేయాలని వారంతా నినదించారు. ఈ సమావేశం సమాచారం తెలుసుకొన్న అప్పటి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో జలియన్ వాలాబాగ్ చేరుకున్నాడు. సాయుధులైన సైన్యం జలియన్ వాలాబాగ్ గేట్లకు ఎదురుగా నిలబడ్డారు. వెంటనే అక్కడివారిపై కాల్పులు జరపాల్సిందిగా డయ్యర్ ఆదేశించాడు. దీంతో వారు విచక్షణారహితంగా అమాయకులైనవారిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ఏకధాటిగా పది నిమిషాలపాటు విచక్షణారహితంగా సైన్యం కాల్పులు కొనసాగించింది. మందు గుండు సామాగ్రి అయ్యేదాగా కాల్పులు నిర్వహించారు. నాటి దుర్ఘటనలో ఎంత మంది చనిపోయారో స్పష్టమైన 488 మందిబ్రిటీష్ తుపాకీ బుల్లెట్లకు బలైనట్లు నమోదు చేశారు. కానీ అసువులు బాసిన వారి సంఖ్య చాలా ఎక్కువ. ఆ ఘటనకు కారణమైన జనరల్ డయ్యర్ బృందం 1,250 బుల్లెట్లు కాల్చినట్టు నమోదు చేశారు. ఆనాడు అసువులు బాసిన వీరులకు నివాళిగా పంజాబ్ ప్రభుత్వం జిలయన్వాలాబాగ్ స్మారకపార్కును ఏర్పాటు చేసింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.