హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rising India Summit: చట్టం అందరికీ సమానమే.. ఓబీసీలకు ఇంకా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పలేదు: జైశంకర్

Rising India Summit: చట్టం అందరికీ సమానమే.. ఓబీసీలకు ఇంకా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పలేదు: జైశంకర్

జైశంకర్

జైశంకర్

న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్ అట్టహాసంగా జరుగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్ లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మోదీ ఇంటిపేరు' వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఒక వర్గాన్ని అవమానించారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక సమాజాన్ని అవమానించారని.. ఆ తప్పును సరిదిద్దడానికి ఆయనకు అవకాశం ఉంది.. కానీ రాహుల్ ఆ పని చేయలేదంటూ మండిపడ్డారు.

శాంతి కోసం ఏదైనా చేస్తాం:

రష్యా , యుక్రెయిన్ యుద్ధం ఏడాది దాటి పోయినా ఇప్పటకీ కొనసాగుతూనే ఉంది.. దీనిపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం కోసం పీస్ మేకర్ రోల్ ప్లే చేయడానికి కూడా సిద్ధమేనన్నారు. శాంతి కోసం భారత్ చేయాల్సిందంతా చేస్తుందని చెప్పారు.. ఇక చాలా విషయాలు మారిపోయాయని.. ప్రపంచం ఇప్పుడు క్లిష పరిస్థితుల్లో ఉందన్నారు జైశంకర్. ముఖ్యంగా యూరప్, పాశ్చత్య దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయన్నారు.

సౌత్ కి ఇండియానే ప్రధాన గొంతుకగా నిలుస్తుందన్నారు జైశంకర్.. ఇలా దక్షిణ దేశాలకు అండగా నిలవడానికి ఇండియా చాలా కష్టపడిందన్నారు. యూరప్ దేశాలతో రష్య సంబంధాలు మారిపోయాయని.. అలాగే భవిష్యత్ లో ఏషీయా-రష్యా మధ్య సంబంధాలు కూడా మారుతాయన్నారు జైశంకర్. ఇటు చైనాతో పాశ్చత్యా, రష్యా మాధ్య సంబంధాలపై కూడా జైశంకర్ మాట్లాడారు.. ఆర్థికంగా వెస్ట్ కంట్రీస్ తో చైనా మంచి సంబంధాలు కలిగి ఉందన్నారు జైశంకర్. ఇక రష్యా నుంచి ఆయిల్ దిగుమతి మన మార్కెట్ మంచి కోసమేనన్నారు జైశంకర్

న్యూస్18 నెట్‌వర్క్ తన ప్రీమియర్ లీడర్‌షిప్ కాన్క్లేవ్ - రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023 ఎడిషన్ కోసం పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘ది హీరోస్ ఆఫ్ రైజింగ్ ఇండియా’ అనేది ఈ సమ్మిట్ థీమ్. విశేషమైన విజయాలు సాధించిన వ్యక్తుల అసాధారణ విజయాలను ఈ సదస్సు హైలైట్ చేస్తుంది. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది.

First published:

Tags: Rahul Gandhi

ఉత్తమ కథలు