బాలాకోట్‌లో మళ్లీ తెరుచుకున్న ఉగ్రవాద శిబిరాలు...పాక్ కుట్రలు

కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో అలజడుు సృష్టించేందుకు పాకిస్తాన్‌ కుట్రలు చేస్తోందని.. అందుకే బాలోకోట్‌లో ఉగ్ర శిబిరాలు తెరిచారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.

news18-telugu
Updated: October 14, 2019, 10:46 PM IST
బాలాకోట్‌లో మళ్లీ తెరుచుకున్న ఉగ్రవాద శిబిరాలు...పాక్ కుట్రలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలు మళ్లీ తమ కార్యకలాపాలు మొదలు పెట్టాయి. దాదాపు 45 నుంచి 50 మంది జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు బాలాకోట్‌ శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారని హోంశాఖ వద్ద సమాచారం ఉందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఉగ్రవాదుల్లో కొందరు ఆత్మహుతి దళ సభ్యులకు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో అలజడుు సృష్టించేందుకు పాకిస్తాన్‌ కుట్రలు చేస్తోందని.. అందుకే బాలోకోట్‌లో ఉగ్ర శిబిరాలు తెరిచారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు జైషే సంస్థ రెక్కీ నిర్వహించిందని ఇప్పటికే నిఘా వర్గాలకు సమాచారం అందింది.

కాగా ఉగ్రవాదుల కుట్రలను ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని, వారికి ఎలాంటి అడ్డంకులు లేవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు