ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ఇకపై కఠిన చర్యలు తప్పవు. అవును కాకపోతే ఇది మన దగ్గరక బీహార్ రాష్ట్రంలో. ఈ మేరకు నితీశ్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే మీ ఇంటి వద్ద పోలీసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సైబర్ క్రైమ్ను అరికట్టేలా రాష్ట్ర పోలీసుల నోడల్ ఏజెన్సీ అయిన ఎకనామిక్ క్రైమ్స్ వింగ్(EOW) రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర కార్యదర్శులందరికీ ఓ లేఖ రాసింది. ఎవరికైనా అభ్యతరకర వ్యాఖ్యల గురించి తెలిస్తే తెలిజేయమని కోరింది.
సామాజిక మాధ్యమాల్లో బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవాంఛిత వ్యక్తులు, సంస్థలు వ్యాఖ్యలు చేస్తే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోనుంది. ఈ లేఖలో జనవరి 21న ఈఓడబ్ల్యూ అదనపు డైరెక్టర్ జనరల్(ADG) నయ్యర్ హస్నైన్ ఖాన్ రాశారు. కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం వెలుగులోకి వచ్చాయని ఇందులో పేర్కొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాట్లలో ఎవరైతే చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో సైబర్ క్రైం పరిధిలోకి వస్తారు. చట్ట ప్రకారం అలాంటి వ్యక్తులు, సంస్థలపై చర్యలు ప్రారంభించడం సముచితంగా అనిపిస్తుందని అని ఆయన అన్నారు.

నితీష్ కుమార్, బీహార్ సీఎం (ఫైల్ ఫోటో)
తప్పు చేసిన వ్యక్తులపై దర్యాప్తు ప్రారంభించిన తర్వాత తగిన చర్యలు తీసుకునే విధంగా ఈఓడబ్ల్యూ పనిచేస్తుందని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇటీవల రాష్ట్రంలో నేరాలు పెరగడంతో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలామంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ విమర్శలు బీహార్ పోలీసుల దృష్టికి వచ్చింది. రూపేశ్ కుమార్ సింగ్ హంతకులను పట్టుకోవడంలో పాట్నా పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించిన మీడియాపై ఇటీవలే సీఎం నితీశ్ కుమార్ కెమేరా ముందే తన ఆవేశాన్ని ఆపుకులేకపోయారు. పాట్నా విమానాశ్రయంలో ఇండిగో విమానయాన సంస్థల స్టేషన్ మేనేజర్ గా పనిచేసిన రూపేశ్ కుమార్ సింగ్, జనవరి 12న తన కార్యాలయం నుంచి తిరిగి రాగానే పాట్నాలోని తన అపార్ట్ మెంటు వెలుపల దుండగులు కాల్పులు జరిపారు.
Published by:Kishore Akkaladevi
First published:January 22, 2021, 20:35 IST