హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Jagdeep Dhankhar : ఎన్​డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా బెంగాల్ గవర్నర్.. బీజేపీ స్కెచ్ అదుర్స్..

Jagdeep Dhankhar : ఎన్​డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా బెంగాల్ గవర్నర్.. బీజేపీ స్కెచ్ అదుర్స్..

జగదీప్ ధనకర్

జగదీప్ ధనకర్

Jagdeep Dhankhar : ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి (Vice President Election) వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో వచ్చే నెలలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడే షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

ఎన్​డీఏ కూటమి ఉపరాష్ట్రపతి (Vice President) అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్​డీఏ ప్రకటించింది. ఎవరూ ఊహించనివిధంగా.. పశ్చిమ బెంగాల్​ గవర్నర్​గా ఉన్న జగదీప్​ ధన్​కర్​ (Jagdeep Dhankhar)కు చాన్స్​ ఇచ్చింది. ఈమేరకు ఈ ప్రకటనను విడుదల చేసింది ఎన్​డీఏ. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ఈ మేరకు జగదీప్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. సమావేశం అనంతరం జేపీ నడ్డా మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. బీజేపీ పెద్దలు వ్యూహం ప్రకారమే జగదీప్ ధన్​కర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ జగదీప్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ముందస్తు చర్చలు జరిపారన్నది స్పష్టం అవుతుంది.ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి (Vice President Election) వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో వచ్చే నెలలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడే షెడ్యూల్ ను విడుదల చేసింది.

జూలై 5న ఉప రాష్ట్రపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది.జూలై 19 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ. జూలై 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. జూలై 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఆగష్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ నిర్వహించిన రోజునే ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు.

అయితే.. బెంగాల్​ సీఎం మమతకు, గవర్నర్​ జగదీప్​కు అస్సలు పడేది కాదు. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలతో సీఎం మమత సొంత నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణలున్నాయి. వీరిద్దరి వివాదంపై కేంద్రానికి చాలాసార్లు ఫిర్యాదులు కూడా అందాయి. నూతన ఉప రాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ స‌భ్యులు ఎన్నుకోనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సునాయాసంగా ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవ‌కాశం ఉంది. సొంతంగా బీజేపీకి లోక్ సభలో 303 మంది, రాజ్యసభలో 92 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందుతారని తెలిసినా తమ అభ్యర్థిని ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో నిలిపే యోచనలో విపక్షాలు ఉన్నాయి.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు రెండు భిన్న భావజాలాలకు మధ్య జరుగుతున్న పోటీగా భావిస్తున్నాయ‌ని విపక్ష పార్టీల నేత‌లు అంటున్నారు. పోటీ అనివార్యం అయితేనే ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఆగస్టు 6న సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉదయం 10 నుంచి 5 గంటల వరకు పోలింగ్ జ‌రుగుతుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నంబ‌రు.63లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

First published:

Tags: Bjp, NDA, Vice President of India, West Bengal

ఉత్తమ కథలు