హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అట్లుంటది మోదీ పనితీరు..అర్థరాత్రి జైశంకర్ కు ప్రధాని ఫోన్ చేసి అలా అడిగారంట!

అట్లుంటది మోదీ పనితీరు..అర్థరాత్రి జైశంకర్ కు ప్రధాని ఫోన్ చేసి అలా అడిగారంట!

జైశంకర్-మోదీ(ఫైల్ ఫొటో)

జైశంకర్-మోదీ(ఫైల్ ఫొటో)

PM Modi Midnight Call To Jaishankar : అర్ధరాత్రి ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ మోదీ లీడర్ షిప్ క్వాలిటీని(Modi Leadership Quality)ప్రశంసించారు జైశంకర్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Jaage ho, TV dekh rahe ho? : అమెరికాలోని న్యూయార్క్(Newyork) లో "మోదీ@2.0: డ్రీమ్స్ మీట్ డెలివరీ" ( Modi@20: Dreams Meet Delivery)అనే బుక్ పై జరిగిన  చర్చా కార్యక్రమంలో పాల్లొన్న భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar)..ప్రధాని మోదీ(PM Modi)వ్యవహరించే తీరుపై ప్రశంసలు కురిపించారు. 2016లో అప్ఘానిస్తాన్(Afghanistan)లోని భారత కాన్సులేట్‌పై దాడి జరిగిన తర్వాత అర్ధరాత్రి ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ మోదీ లీడర్ షిప్ క్వాలిటీని(Modi Leadership Quality)ప్రశంసించారు.

2016లో అప్ఘానిస్తాన్ దేశంలోని మజార్-ఎ-షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై దాడి జరిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి గురించి ఆరా తీయడానికి ప్రధాని మోదీ అర్థరాత్రి దాటిన తనకు ఫోన్ చేశారని జైశంకర్ చెప్పారు. నాటి ఘటనను జై శంకర్ గుర్తుచేసుకుంటూ..""అర్ధరాత్రి దాటింది, అఫ్ఘానిస్తాన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని భారత కాన్సులేట్ దాడికి గురైంది. అప్పుడు నేనే విదేశాంగశాఖ కార్యదర్శిగా ఉన్నా. అర్థరాత్రి సమయంలో విషయం తెలియడంతో మేము ఫోన్‌ల ద్వారా అక్కడ ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అదే సమయంలో ప్రధాని మోదీ స్వయంగా నాకు ఫోన్ చేశారు. అప్పుడు ప్రధాని మోదీ అడిగిన మొదటి ప్రశ్న జాగే హో(Jaage Ho-మెలకువగానే ఉన్నారా)అని. దానికి అవును అని సమాధానమిచ్చాను. అప్పుడు మోదీ మీరు టీవీ చూస్తున్నారా,అక్కడ ఏం జరిగింది అని నన్ను అడిగారు. అప్పుడు అప్ఘాన్ లో జరిగిన ఘటనను ప్రధానికి అప్ డేట్ చేశా. భారత్ నుంచి అవసరమైన సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పాను. అప్పుడు మోదీ పూర్తయ్యాక కాల్ చేయండి అని అన్నారు. అయితే దానికి 2-3 గంటల సమయం పడుతుందని, అది ముగిసిన తర్వాత నేను ప్రధాని కార్యాలయానికి (PMO) కాల్ చేస్తానని మోదీతో చెప్పాను. దీనికి, ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ నాకే కాల్ చేయండి అని అన్నారు.  ఈ ఒక్క మాట మోదీలోని అసాధారణ నాయక్వం గురించి చెప్పడానికి సరిపోతుంది" అని జైశంకర్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

Unemployment Rate : దేశంలో నిరుద్యోగ రేటుపై రిపోర్ట్ రిలీజ్..ఏపీ,తెలంగాణాలో ఇలా!

సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి మోదీ వ్యవహరించే తీరు చాలా గొప్పగా ఉంటుందని జైశంకర్ అన్నారు. క్ష్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రధాని ఎల్లప్పుడూ వెంట ఉంటారని,అదే ఆయన గొప్పతనమని అన్నారు. తనకు తెలియని విషయాలను అడిగి తెలుసుకునేందుకు మోదీ ఏ మాత్రం సందేహించరని అన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Afghanistan, Pm modi

ఉత్తమ కథలు