ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు మంచి రోజులు: రామ్‌నాథ్ కోవింద్

కశ్మీరీ యువతకు నాణ్యమైన విద్య లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు రాష్ట్రపతి.

news18-telugu
Updated: August 14, 2019, 7:59 PM IST
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు మంచి రోజులు: రామ్‌నాథ్ కోవింద్
రామ్‌నాథ్ కోవింద్
  • Share this:
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు మంచి రోజులు వస్తాయన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. దేశంలో వర్తించే చట్టాలన్నీ కశ్మీర్‌కు వర్తించడం ద్వారా కశ్మీర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కశ్మీరీ యువతకు నాణ్యమైన విద్య లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు రాష్ట్రపతి. గురువారం 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ జాతినుద్దేశించి కోవింద్ ప్రసంగించారు. మేలో జరిగిన సాధారణ ఎన్నికలు, గురునానక్ 550వ జయంతి, మహాత్మాగాంధీ 150 జయంతితో పాటు పలు అంశాలను కోవింద్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న మార్పులతో కశ్మీరీలకు ప్రయోజనం కలుగుతుంది. దీని ద్వారా భారతీయులకు ఉన్న హక్కులు కూడా కశ్మీరీలకు వర్తిస్తాయి. దేశంలోని ఇతర పౌరులు పొందుతున్న ప్రయోజనాలు కశ్మీర్ ప్రజలకు కూడా కలుగుతాయి. కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు అభివృద్ధి బాటో పయనిస్తాయి.
రామ్‌నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి

సిక్క మత వ్యవస్థాపకులు గురునానక్ 550వ జయంతిని సెప్టెంబరు 22న సిక్కులు ఘనంగా జరుపుకోనున్నారు. కేవలం సిక్కులే కాకుండా మతాలకు అతీతంగా అందరిరూ గురునానక్‌ను ఆదరిస్తారని తెలిపారు కోవింద్. త్వరలో మహాత్మా గాంధీ 150వ జయంతిని భారతజాతి ఘనంగా జరుపుకోబోతుందని..స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ త్యాగం మరవలేనిదని చెప్పారు.
First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>