హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ITR Filing: ట్యాక్స్ రిటర్న్ ఎప్పటిలోగా ఫైల్‌ చేయాలి? ఐటీఆర్ ఫారమ్స్ ఎన్ని రకాలు..?

ITR Filing: ట్యాక్స్ రిటర్న్ ఎప్పటిలోగా ఫైల్‌ చేయాలి? ఐటీఆర్ ఫారమ్స్ ఎన్ని రకాలు..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఏప్రిల్ 1న కొత్త అసెస్‌మెంట్ ఇయర్‌ 2023-24 ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌(ITR), 2023 జులై 31లోపు దాఖలు చేయాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ITR Filing: పన్ను పరిధిలోకి వచ్చే మొత్తంలో ఇన్‌కమ్‌(Income) ఉన్న వ్యక్తులు ప్రతి సంవత్సరం గడువు తేదీలోగా యాన్యువల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌(ITR) ఫైల్ చేయాలి. ఏప్రిల్ 1న కొత్త అసెస్‌మెంట్ ఇయర్‌ 2023-24 ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌(ITR), 2023 జులై 31లోపు దాఖలు చేయాలి. ఆలస్యంగా ఐటీఆర్‌ను ఫైల్ చేసినందుకు జరిమానా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటే, గరిష్టంగా రూ.1,000 జరిమానా విధిస్తారు. పన్ను ఎగవేసిన మొత్తం రూ.25 లక్షలకు మించి ఉంటే 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. ITR ఫైలింగ్ సీజన్ ప్రారంభం కాబోతున్నందున, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సిన అంశాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

* ITR ఎప్పుడు ఫైల్ చేయాలి?

ఏప్రిల్ 1 నుంచి కొత్త అసెస్‌మెంట్ ఇయర్ ప్రారంభం అవుతుంది. ఐటీఆర్ ఫైల్ చేయడం కూడా ప్రారంభమవుతుంది. పన్ను చెల్లింపుదారులు ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు ఆర్థిక సంవత్సరం 2022-23లో ఆర్జించిన ఆదాయం కోసం వారి ITRని ఫైల్ చేయవచ్చు. గడువులోగా ఫైల్‌ చేయలేకపోయిన వారు, జులై 31 తర్వాత కొంత ఖర్చుతో వచ్చే బిలేటెడ్‌ ఐటీఆర్‌ ఫైల్‌ చేయవచ్చు.

ఐటీఆర్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ రెండు విధాలుగా ఫైల్ చేయవచ్చు. ఆన్‌లైన్‌ మోడ్‌ను ఇ-ఫైలింగ్ అంటారు. ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometax.gov.in ద్వారా ఇ-ఫైలింగ్‌ చేయవచ్చు. ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఆఫ్‌లైన్ మోడ్‌ను ఎంచుకునేవారు ఐటీఆర్‌ కోసం ఆఫ్‌లైన్ యుటిలిటీని ఉపయోగించాలి.

* ఆదాయ పన్నును ఎలా లెక్కించాలి?

వివిధ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కంపెనీలు ఆదాయ పన్నును లెక్కించేందుకు ఉపయోగపడే ఫ్రీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ క్యాలిక్యులేటర్‌లను అందిస్తున్నాయి. ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, పన్ను చెల్లింపుదారులు లేటెస్ట్‌ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారో లేదో చెక్‌ చేసుకోవాలి. ఇది ఇండియన్‌ యాన్యువల్‌ శాలరీ ప్రకారం ఎంత ఆదాయ పన్ను చెల్లించాలో తెలియజేస్తుంది.

Rising India Summit: రేపటి నుంచి రైజింగ్ ఇండియా సమ్మిట్..సంయుక్తంగా నిర్వహిస్తున్న న్యూస్18 నెట్‌వర్క్, పూనావాలా ఫిన్‌కార్ప్

* ITR ఫారమ్‌ను ఎలా ఎంచుకోవాలి?

ఆదాయ పన్ను శాఖ ఏడు వేర్వేరు ఫారంలు నోటిఫై చేసింది. ఇప్పటి వరకు అవి ITR 1, ITR 2, ITR 3, ITR 4, ITR 5, ITR 6, ITR 7గా ఉన్నాయి. ITR ఫారంలు పన్ను చెల్లింపుదారుల ఆదాయ వనరులు, ఆర్జించిన ఆదాయం మొత్తం, పన్ను చెల్లింపుదారులు వ్యక్తులు, HUF, కంపెనీలు మొదలైన వాటిపై ఆధారపడి మారుతూ ఉంటాయి. పన్ను చెల్లింపుదారులు తగిన ITR ఫారంను జాగ్రత్తగా నిర్ధారించుకోవాలి.

రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తి , జీతం, ఒక ఇల్లు, ఇతర వనరులు (వడ్డీ మొదలైనవి) వాటి నుంచి ఆదాయాన్ని పొందే వ్యక్తి ITR-1 ఫైల్ చేయవచ్చు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ ద్వారా ఆదాయం, రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ITR-2 ఫైల్ చేయాలి. ప్రొఫెషనల్స్‌ ITR-3 ఫైల్‌ చేస్తారు.

ITR-4ను ఇండివిడ్యువల్స్‌, హిందూ అవిభాజ్య కుటుంబాలు(HUF), మొత్తం ఆదాయం రూ.50 లక్షల వరకు, వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఉన్న సంస్థలు దాఖలు చేయవచ్చు. ITR-5, ITR-6 LLPలు, బిజినెసెస్‌ దాఖలు చేస్తాయి. సెక్షన్ 139(4A), సెక్షన్ 139 (4B), సెక్షన్ 139 (4C) లేదా సెక్షన్ 139 4(D) కిందకు వచ్చే కంపెనీలు, వ్యక్తులు ITR-7 ఫైల్ చేయాలి.

First published:

Tags: Income tax, ITR, ITR Filing

ఉత్తమ కథలు