HOME » NEWS » national » IT RAIDS WERE CONDUCTED LAST YEAR AGAINST THE PERSON WHO THROWN SHOE ON BJP MP GVL NARASIMHA RAO BA

జీవీఎల్ మీద బూటు విసిరిన వ్యక్తిపై ‘ఐటీ దాడులు’

బూటు విసిరిన శక్తి భార్గవ్‌‌ను పోలీసులు విచారించి వదిలేశారు. ఆయనపై ఎవరూ కేసు పెట్టకపోవడంతో పోలీసులు విచారించి, ఎలాంటి దురుద్దేశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత వదిలిపెట్టారు.

news18-telugu
Updated: April 18, 2019, 8:18 PM IST
జీవీఎల్ మీద బూటు విసిరిన వ్యక్తిపై ‘ఐటీ దాడులు’
బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై షూ దాడి..
  • Share this:
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మీద ఓ వ్యక్తి బూటు విసరడం సంచలనంగా మారింది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సందర్భంగా శక్తి భార్గవ్ అనే వ్యక్తి జీవీఎల్ నరసింహారావు మీద బూటు విసిరాడు. హిందూ టెర్రర్ అనే అంశంపై జీవీఎల్ మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. జీవీఎల్‌‌ను తాకుతూ ఆ బూటు కిందపడింది. అయితే, ఈ శక్తి భార్గవ్ అనే వ్యక్తి మీద గతంలో ఐటీ దాడులు జరిగినట్టు జీవీఎల్ తెలిపారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్ కాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ శక్తి భార్గవ్‌కు సంబంధించిన హాస్పటల్, రియల్ ఎస్టేట్ సంస్థల్లో తనిఖీలు చేశారు. అతను రూ.500 కోట్ల విలువైన బంగళాలు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని జీవీఎల్ చెప్పారు. అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? దానికి సంబంధించి ఆదాయ వివరాలను ఇవ్వాల్సిందిగా ఐటీ అధికారులు ప్రశ్నించారని తెలిపారు. అయితే, ఇప్పుడు తన మీద బూటు విసరడానికి కారణం ఏంటో తెలియలేదన్నారు. తన మీద వ్యక్తిగతంగా చేసిన దాడిగా భావించడం లేదని చెప్పారు. దీన్ని రాజకీయం చేయడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే, బూటు విసిరిన శక్తి భార్గవ్‌‌ను పోలీసులు విచారించి వదిలేశారు. ఆయనపై ఎవరూ కేసు పెట్టకపోవడంతో పోలీసులు విచారించి, ఎలాంటి దురుద్దేశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత వదిలిపెట్టారు.
First published: April 18, 2019, 8:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading