IT RAIDS ON NOIDA TOP REALTOR ACE GROUP CMD AJAY CHAUDHARY WHO IS BELIEVED AS SP CHIEF AKHILESH CLOSE AID MKS
రాజధాని రియల్టర్ అజయ్ చౌదరిపై ఐటీ దాడులు.. మాజీ సీఎం సన్నిహితుడు.. సైకిల్ పార్టీపై ఆర్థిక పిడుగు!
ఏస్ గ్రూప్ సీఎండీ అజయ్ చౌదరి
ఒకప్పుడు రాజధానిలో చిన్న బైక్ పై గల్లీల్లో తిరిగిన అతను కేవలం పదేళ్లలోనే లక్షల కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. మాజీ ముఖ్యమంత్రి అండదండలతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను కుమ్మేసిన అతను ఇప్పుడు కష్టాల్లో పడ్డాడు. అజయ్ ఆస్తులు, ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు..
రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దందాలోగానీ, ఆకాశాన్ని తాకే భారీ భవంతుల నిర్మాణంలోగానీ ఆయనను మించిన ఘనుడు లేడు. ఒకప్పుడు రాజధానిలో చిన్న బైక్ పై గల్లీల్లో తిరిగిన అతను కేవలం పదేళ్లలోనే లక్షల కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. మాజీ ముఖ్యమంత్రి అండదండలతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను కుమ్మేసిన అతను ఇప్పుడు కష్టాల్లో పడ్డాడు. ఒకటీ రెండూ కాదు.. ఆయనకు చెందిన 40 ఆస్తులు, ఆఫీసులు, ఇళ్లపై కేంద్ర ఐటీ శాఖ ఆకస్మిక దాడులు చేసింది. మాజీ ముఖ్యమంత్రి సన్నిహితులుగా భావించే నాలుగురు బడా బాబులపై 10 రోజుల వ్యవధిలోనే ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతున్నది. ఈ పరిణామాలు సైకిల్ పార్టీకి కోలుకోలేని ఆర్థిక దెబ్బగా కనిపిస్తోంది. వివరాలివి..
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతున్నా కొద్దీ విపక్ష సమాజ్ వాదీ పార్టీ ఆర్థిక మూలాలపై బీజేపీ దాడులు పెరిగిపోయాయి. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆదాయ పన్ను విభాగం (ఐటీ) గడిచిన కొద్ది రోజులుగా ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సన్నిహితులను టార్గెట్ చేసింది. 10 రోజుల వ్యవధిలోనే మాజీ సీఎంకు బాగా క్లోజ్ అనుకున్న నలుగురు బడా బాబులపై ఐటీ దాడులు జరిగడం కలకలం రేపుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీ, యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో టాప్ రియల్టర్ గా కొనసాగుతోన్న అజయ్ చౌదరిపై ఐటీ దాడులు నిర్వహించింది. అజయ్ సీఎండీగా ఉనన ఏస్ గ్రూప్ నకు చెందిన 40కిపైగా కార్యాలయాలు, ఇళ్లు, స్థలాలపై ఐటీ అధికారులు మెరుపుదాడి చేశారు. నోయిడా, ఆగ్రాతోపాటు అజయ్ సొంత ఊళ్లలోనూ ఐటీవారు సోదాలు నిర్వహించారు. మాజీ సీఎం అఖిలేశ్ కు ఆప్తుడైన సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ పమ్మీ జైన్ పై గత వారం ఐటీ విభాగం జరిపిన దాడుల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పమ్మీ జైన్ వద్ద లభించిన పత్రాల్లో అజయ్ చౌదరి ఆర్థిక అవకతవకలను ఐటీ వారు గుర్తించారి, వాటి ఆధారంగానే ఏస్ గ్రూప్ ఆస్తులపై దాడులు నిర్వహించారని తెలుస్తోంది.
ఢిల్లీ రాజధాని ప్రాంతం, నోయిడాలో టాప్ రియల్టర్ గా ఉన్న అజయ్ చౌదరిపై ఐటీ దాడుల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. అజయ్ చౌదరికి చెందిన ACEఇన్‌ఫ్రాసిటీ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్, ACEమెగా స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టార్ ల్యాండ్ క్రాఫ్ట్ లిమిటెడ్, స్టార్ సిటీ బిల్డ్ కాన్, అజయ్ రియల కాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఇలా 40 వరకు అజయ్ చౌదరి కంపెనీలు, ఆస్తులపై ఐటీ అధికారులు దాడు చేశారు. గత వారం ఎస్పీ ఎమ్మెల్సీ పమ్మి గోయల్ ఆస్తులపై దాడుల సమయంలో అజయ్ కి ఆర్థిక నేరాలకు సంబందించిన ఆధారాలను ఐటీ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది.
ఐటీ దాడుల తర్వాత అజయ్ చౌదరిపై చర్చ పెరిగింది. అజయ్ చౌదరిని ఒకప్పుడు సంజు నగర్ అని పిలిచేవారట. ఆ సమయంలో అతను బైక్‌పై గల్లీ బాయ్ లాగా తిరుగుతుండేవాడని తెలుస్తోంది. అయితే, రాజకీయ పార్టీల సాయంతో అజయ్ కేవలం ఏడేళ్లలోనే 2010 నుంచి 2017 వరకు భారీగా డబ్బు కూడబెట్టాడని చెబుతున్నారు. మాజీ సీఎం అడతో స్వల్ప వ్యవధిలోనే వేల కోట్లకు అధిపతి అయిన అజయ్ చౌదరి.. తిరిగి సైకిల్ గుర్తు పార్టీకి తనవంతు సాయంగా సమర్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూపీలో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అఖిలేశ్ సన్నిహితులపై వరుస ఐటీ దాడులు ఎస్పీ ఆర్థిక మూలాలపై దెబ్బ అనే వాదన వినిపిస్తోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.