కన్నడ నటులపై ఐటీ పంజా..సీఎం భార్య నివాసంలోనూ సోదాలు

కర్నాటక సీఎం కుమారస్వామి భార్య, సినీ నటి రాధిక నివాసంలోనూ తనిఖీలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. బెంగళూరులో ఏకకాలంలో 60 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి

news18-telugu
Updated: January 3, 2019, 1:13 PM IST
కన్నడ నటులపై ఐటీ పంజా..సీఎం భార్య నివాసంలోనూ సోదాలు
కన్నడ స్టార్స్ ఇళ్లలో ఐటీ సోదాలు
  • Share this:
కన్నడ చిత్రసీమ శాండల్‌వుడ్‌పై ఐటీ పంజా విసిరింది. కన్నడ సినీ స్టార్స్ పునీత్ రాజ్‌కుమార్, శివకుమార్, కిచ్చా సుదీప్, కేజీఎఫ్ స్టార్ యశ్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నివసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. కర్నాటక సీఎం కుమారస్వామి భార్య, సినీ నటి రాధిక నివాసంలోనూ తనిఖీలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. బెంగళూరులో ఏకకాలంలో 60 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. వారి నివాసాల నుంచి ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసింది. సినీస్టార్లు పెద్ద మొత్తంలో ఆదాయపన్ను ఎగ్గొట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

రాక్‌లైన్‌ వెంకటేశ్‌‌తో పాటు నిర్మాతలు జయన్న, కేజీఎఫ్‌ చిత్ర నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ నివాసాల్లో సైతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత రాక్‌లైన్‌ వెంకటేశ్‌.. కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎన్నో హిట్ సినిమాలు తీశారు. పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ పనిచేశారు. ఇక 2015లో వచ్చి బజ్‌రంగీ భాయ్‌జాన్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు..జాతీయ పురస్కారాన్ని సైతం సాధించింది.
First published: January 3, 2019, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading