ష్.. గప్‌చుప్: చాట్‌బండి వ్యాపారి ఇంట్లో రూ.1.2 కోట్లు

రెండేళ్లుగా ఎలాంటి ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. దీంతో మొత్తం రెండేళ్ల బాకీ కక్కాల్సి వచ్చింది.

news18-telugu
Updated: October 19, 2018, 3:58 PM IST
ష్.. గప్‌చుప్: చాట్‌బండి వ్యాపారి ఇంట్లో రూ.1.2 కోట్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారి దగ్గర ఏముంటుంది? చిల్లల డబ్బులు తప్ప. అదే బడా బాబుల మీద రైడ్స్ చేస్తే.. బండారం మొత్తం బయటపడుతుంది. ఆదాయం, ఖర్చు లెక్కలు బయటకు వస్తాయి. ఒకవేళ లెక్కల్లో తేడా వస్తే దానికి తగ్గట్టు జరిమానా పడుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే చిరు వ్యాపారులను పట్టుకుంటే ఏమొస్తుంది? అని ఆ ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఆలోచించలేదు. పెద్ద పెద్ద వాళ్ల పని పట్టడాన్ని పక్కనపెట్టి.. ఓ సారి చిరు వ్యాపారుల మీద వరుసగా దాడులు చేశారు.

పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన ఓ గప్ చుప్ బండి నడిపే వ్యక్తి ఇంటి మీద ఐటీ దాడులు జరిపారు. అతడి వద్ద దొరికిన డబ్బు చూసి షాక్ అయ్యారు. అక్షరాలా కోటి 20లక్షల రూపాయల లెక్కల్లో లేని డబ్బు వెలుగుచూసింది. పాటియాలాకు చెందిన ఆ వ్యక్తి లూథియానాలో చాట్ బండి నడుపుతుంటాడు. అతనికి అలాంటివే మరికొన్ని ఉన్నాయి. దీనికి తోడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి బాగానే సంపాదించాడు. ఓ వైపు ఆదాయం పెరుగుతున్నా.. మరోవైపు రెండేళ్లుగా ఎలాంటి ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. దీంతో మొత్తం రెండేళ్ల బాకీ కక్కాల్సి వచ్చింది.

పెద్ద పెద్ద వ్యాపారుల కంటే చిన్న చిన్న వ్యాపారులే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు. అందుకే చిరు వ్యాపారుల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కానీ, తిమింగలాలను వదిలేసి.. ఇలా చిన్న చేపల మీద పడుతున్నారనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ, చాట్ బండి వ్యాపారి వద్ద రూ.1.20 కోట్ల డబ్బు దొరకడం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 19, 2018, 3:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading