తమిళనాడు, కర్ణాటకలో ఐటీ సోదాలు... టార్గెట్ డీఎంకే, జేడీఎస్...

కనిమొళి (File)

Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 18న జరగనుండగా... తమిళనాడు, కర్ణాటకలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

  • Share this:
రెండో దశ ఎన్నికలకు సంబంధించి... తమిళనాడు, కర్ణాటకలో ప్రచారం ముగిసేలోపే... ఐటీ అధికారులు దాడులతో విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఎన్డీయే కూటమికి సవాల్ విసురుతున్న DMK, JDS పార్టీల నేతలు, వాళ్ల బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. తమిళనాడులో DMK చీఫ్ స్టాలిన్ చెల్లెలు, ఆ పార్టీ నుంచీ తూతుక్కూడిలో పోటీ చేస్తున్న కనిమొళి ఇంట్లో ఐటీ అధికారులు రాత్రి సోదాలు చేశారు. కనిమొళి తూతుక్కుడిలో తప్పక గెలవాలనే ఉద్దేశంతో కొన్ని నెలలుగా అక్కడే టెంపపరీ ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే ఉండి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేతలతో భేటీలు కూడా అక్కడే సాగించారు. ఐతే... తూతుక్కుడి నియోజకవర్గం నుంచీ బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ బరిలో ఉన్నారు. ఏప్రిల్ 18న పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో ఇలాంటి దాడులు చెయ్యడంపై DMK నేతలు భగ్గుమంటున్నారు.

తమిళిసై సౌందరరాజన్ తన ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు ఉంచుకున్నారని ఆరోపించిన DMK చీఫ్ స్టాలిన్... ఆమె ఇంట్లో ఎందుకు దాడులు చెయ్యట్లేదని కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి స్వయంగా కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ లేదని ఫైర్ అయ్యారు. ఎన్నికల సంఘంలో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు స్టాలిన్.


ఇక తేని జిల్లా... ఆండిపట్టిలో ఓటర్లకు డబ్బులిస్తున్నారని తెలియడంతో పోలీసులు టీటీవీ దినకరన్ అధ్యక్షుడిగా ఉన్న AMMK పార్టీ ఆఫీస్‌లో తనిఖీలకోసం వెళ్లారు. ఆ సమయంలో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడికి తరలిరాగా... తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వాళ్లను నిలువరించేందుకు పోలీసులు గాలిలో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

తమిళనాడులో సీఎం పళనిస్వామి స్వయంగా డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఎన్నికల ప్రచారం ముగిన తర్వాత ఆయన పాంప్లెట్లతో పాటూ డబ్బులు కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కలకలం రేపింది. ప్రస్తుతం ఈసీ అధికారులు ఆ వీడియోను పరిశీలిస్తున్నారు.


ఇక కర్ణాటకలో DMK చీఫ్ దేవెగౌడ సోదరుడి ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. అలాగే కొంతమంది జేడీఎస్ నేతల ఇళ్లను టార్గెట్ చేశారు. అదే సమయంలో దినకరన్ పార్టీ ఆఫీసులో కూడా ఈసీ టీం తనిఖీలు చేసి రూ.50,00,000 కనిపెట్టింది.

కర్ణాటకలో మొత్తం 12 చోట్ల ఈ దాడులు జరిగాయి. హసన్ లోక్ సభ స్థానం నుంచీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ, మాండ్య లోక్ సభ స్థానం నుంచీ దేవెగౌడ మనవడు నిఖిల్ ఎన్నికల్లో పోటీ చేశారు. దాంతో దేవెగౌడ తమ్ముడి కొడుకు పాపణ్ణతోపాటూ... కొంతమంది జేడీఎస్ నేతల ఆఫీసుల్లో కూడా దాడులు జరిగాయి.

ఇవి కూడా చదవండి :

చందమామపై పుష్కలంగా నీరు... శుభవార్త చెప్పిన నాసా...

ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్... ఎక్కడెక్కడ అంటే...

విజయసాయిరెడ్డికి బెదిరింపు కాల్స్... ఎవరు చేస్తున్నారంటే...

పుదుచ్చేరిలో ఈసారి గెలిచేదెవరు... పుదుచ్చేరి లోక్ సభ స్థానం ఎందుకు ప్రత్యేకమైనది...
First published: