• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • IT IS TRESPASSING ON RAILWAYS PROPERTY RAILWAY BOARD CHARIMAN ON AMRITSAR TRAIN TRAGEDY

అమృత్‌సర్ దుర్ఘటనపై విచారణ జరిపించలేం.. ఎందుకంటే!: రైల్వే బోర్డ్ ఛైర్మన్

అమృత్‌సర్ దుర్ఘటనపై విచారణ జరిపించలేం.. ఎందుకంటే!: రైల్వే బోర్డ్ ఛైర్మన్

అమృత్‌సర్ దుర్ఘటనపై స్థానికుల ఆగ్రహం..

 • Share this:
  పంజాబ్ అమృత్‌సర్‌లో జరిగిన దుర్ఘటనపై రైల్వే వైపు నుంచి ఎలాంటి విచారణ ఉండబోదని రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్వని లోహని స్పష్టం చేశారు. రైలు పట్టాలపై జనం గుమిగూడటం రైల్వే నిబంధనలకు విరుద్దమని.. రైల్వే చట్టాల ప్రకారం ఇది నేరమని చెప్పారు. కాబట్టి దీనిపై రైల్వే బోర్డ్ విచారణ జరిపించబోదని తెలిపారు.

  అమృత్‌సర్ దుర్ఘటన నేపథ్యంలో రైల్వే బోర్డ్ ఛైర్మన్ అశ్వని అర్థరాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆయనతో పాటు రైల్వే జనరల్ మేనేజర్ విశ్వేష్ చూబే, రైల్వే ప్రొటెక్షన్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ కూడా అక్కడికి వెళ్లారు.

  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అశ్వని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అన్న మీడియా ప్రశ్నకు ఆయన జవాబు దాటవేశారు. ప్రస్తుతం ఆ రూట్‌లో కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు తెలిపారు.

  కాగా, అమృత్‌సర్ దుర్ఘటనపై తమకేమి సంబంధం లేదని ప్రకటించడంతో.. రైల్వే వైపు నుంచి బాధితులకు ఎటువంటి నష్ట పరిహారం అందే అవకాశం లేదు. నష్ట పరిహారం సంగతి పక్కనపెడితే.. జరిగిన ఘటనకు ఎవరు బాధ్యులు అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. పంజాబ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎటువంటి న్యాయం చేస్తుందన్నది వేచి చూడాలి.
  Published by:Srinivas Mittapalli
  First published:

  అగ్ర కథనాలు