న్యూఢిల్లీ: భారత తొలి సీడీఎస్ జనరల్, ఆయన భార్య వెళుతున్న ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటికొచ్చింది. తమిళనాడులోని కూనూర్ నీలగిరి హిల్స్ అడవిలో ఓ చెట్టుపై ఈ హెలికాఫ్టర్ కూలింది. అయితే.. ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు గాల్లో హెలికాఫ్టర్ వెళుతుండగా తీసిన వీడియో ఒకటి బయటికొచ్చింది.
బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఈ హెలికాఫ్టర్ వెళుతున్న సమయంలో వాతావరణం అంత అనుకూలంగా లేదని, ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉందని వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ప్రమాదం జరగడం వెనుక ఉన్న కారణాలపై పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోయినప్పటికీ వాతావరణం మాత్రం అనుకూలంగా లేదని ఈ వీడియోతో స్పష్టమైంది. హెలికాఫ్టర్ వెళుతున్న సమయంలో కొందరు ఆ శబ్దానికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు.
#HelicopterCrash #ArmyHelicopterCrash
First Video: బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిపోవడానికి ఒక్క క్షణం ముందు వీడియో ఇది.. pic.twitter.com/1knGIN1hxR
— News18 Telugu (@News18Telugu) December 9, 2021
అంతేకాదు.. హెలికాఫ్టర్ మేఘావృతమైన పరిధిలోకి వెళ్లగానే ఇంజన్ శబ్దం ఆగిపోవడం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఆ వెంటనే హెలికాఫ్టర్‌లో మంటలు రేగి కిందపడిపోయి ఉండొచ్చని వీడియో చూసిన వారు భావిస్తున్నారు.
తమిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఉదయం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో ఆర్మీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.కూనూరులో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin rawat) తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉండటంలో అంతా అప్రమత్తమయ్యారు. ఆర్మీకి చెందిన MI-17 V5 విమానం... నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది.
ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో 9 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే అనంతరం అందులో 14 మంది ఉన్నట్టు ధృవీకరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిపిన్ రావత్ తమిళనాడుకు వచ్చారు. కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ బేస్ వరకు విమానంలో వెళ్లారు. అక్కడ వీరితో పాటు మరో ఐదుగురు కలిసి.. మొత్తం 14 మంది ప్రత్యేక హెలికాప్టర్‌లో కూనూర్‌కు బయలుదేరారు. ఐతే సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Helicopter Crash, Tamilnadu, Viral Video