సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల... కేజ్రీవాల్, స్మృతి ఇరానీ ఖుషీ

సీబీఎస్ఈ ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ కుమారుడు పులకిత్ కేజ్రీవాల్ 96.4 శాతం మార్కులు సాధించాడు. స్మృతి ఇరానీ కుమారుడు జోర్ 91 శాతం మార్కులు సాధించాడు.

news18-telugu
Updated: May 2, 2019, 4:31 PM IST
సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల... కేజ్రీవాల్, స్మృతి ఇరానీ ఖుషీ
కుమారుడు జోర్‌తో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Twitter)
  • Share this:
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో తమ పుత్రరత్నాలు మంచి స్కోర్ సాధించడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖుషీగా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కుమారుడు పులకిత్ కేజ్రీవాల్ 96.4 శాతం మార్కులు సాధించాడు. స్మృతి ఇరానీ కుమారుడు జోర్ 91 శాతం మార్కులు సాధించాడు. దీంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పులకిత్ కేజ్రీవాల్ నోయిడా సెక్టార్ 30లోని డీపీఎస్‌లో చదువుతున్నాడు. 2017లో ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో కూడా 10జీపీఏ సాధించాడు. ‘దేవుడి దయ, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో పులకిత్ 96.4శాతం మార్కులు సాధించాడు.’ అని పులకిత్ తల్లి ట్వీట్ చేశారు.



మరోవైపు ‘నా కొడుకు జోర్‌ను చూసి గర్వపడుతున్నా. వరల్డ్ కెంపో ఛాంపియన్ షిప్‌లో రజతపతకం సాధించడమే కాదు. 12వ తరగతి పరీక్షల్లో 91 శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు. తల్లిగా చాలా గర్వపడుతున్నా.’ అని ట్వీట్ చేశారు.



కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గతంలో విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 2, 2019, 4:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading