Vikas Dubey: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

వికాస్ దుబేతో పాటు అతడి ముఖ్య అనుచరులకు దుబాయ్‌తో పాటు పలు ఇతర దేశాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి తెలుస్తోంది. లక్నోలో 8 నెలల క్రితం రూ.5 కోట్ల విలువైన భవనాన్ని కొన్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు.

news18-telugu
Updated: July 10, 2020, 11:13 AM IST
Vikas Dubey: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
వికాస్ దుబే
  • Share this:
గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే హతమవడంతో ఇప్పుడు అతని ఆస్తులపై చర్చ జరుగుతోంది. అతి తక్కువ సమయంలోనే వికాస్ దుబే కోట్లకు పడగలెత్తాడు. కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యల ద్వారా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు యూపీ పోలీసులు చెబుతున్నారు. ఆయన ఆస్తులపై ఇప్పటికే ఐటీశాఖకు సమాచరం అందించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే వికాస్ దుబే ఆస్తులకు సంబంధించి ఈడీ, ఐటీ రంగంలోకి దిగి దూకుడు పెంచనున్నాయి. గ్యాంగ్‌స్టర్ ఆస్తుల లెక్కలు తేల్చనున్నాయి.

యూపీ పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. వికాస్ దుబేకు 12 ఇళ్లతో పాటు పలు చోట్ల 21 స్థలాలు ఉన్నాయి. కాన్పూర్‌లోని పాంకీ ప్రాంతంలో వికాస్ దుబేకు ఓ డూప్లెక్స్ బిల్డింగ్ ఉంది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. వికాస్ దుబే అనుచరుడికి 80 ఫీట్స్ రోడ్ ఏరియాలో ఆర్యన్‌నగర్‌లో రూ.28 కోట్ల విలువైన ఆస్తి ఉంది. మరో రెండు సర్కిళ్లలో రూ.20 కోట్ల విలువైన 6 ప్రాపర్టీలు ఉన్నాయి.

వికాస్ దుబేతో పాటు అతడి ముఖ్య అనుచరులకు దుబాయ్‌తో పాటు పలు ఇతర దేశాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి తెలుస్తోంది. లక్నోలో 8 నెలల క్రితం రూ.5 కోట్ల విలువైన భవనాన్ని కొన్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు. బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లోనూ పెట్టుబడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ ఆస్తులపై ఈడీ, ఐటీ శాఖలు దృష్టిసారించాయి. యూపీ పోలీసులు నమోదుచేసిన కేసుపై PMLA కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే ఈడీ అధికారులు కాన్పూర్‌లో కొందరు పోలీసు ఉన్నతాధికారులను కలిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం ఉదయం గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. వికాస్‌ను మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని శివ్లీకి తరలిస్తున్న క్రమంలో.. కాన్పూర్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో.. వికాస్ దుబే మరణించాడని పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని కాన్పూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు
Published by: Shiva Kumar Addula
First published: July 10, 2020, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading