ISSUANCE OF POSTAL STAMP TO MARK THE COMPLETION OF THE YEAR OF VACCINATION DRIVE IN INDIA SNR
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కి ఏడాది పూర్తి..పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన కేంద్రం
PHOTO CREDIT:Twitter
vaccine stamp: భారత్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదటి వార్షికోత్సాన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. కరోనాపై ప్రపంచం వ్యాప్తంగా జరిగిన పోరాటంలో శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌ని కనుగొని భారతీయ మేధాశక్తిని ప్రపంచానికి తెలియజేశారని కేంద్రమంత్రి కొనియాడారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కి గుర్తుగా పోస్టల్ స్టాంప్‌ని విడుదల చేశారు.
కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించి ఏడాది (1YearOfVaccineDrive)పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌కి గుర్తుగా ఓ పోస్టల్ స్టాంప్(Postal stamp)ని విడుదల చేసింది. భారతదేశం దేశీయ కోవిడ్ వ్యాక్సిన్‌ని అభివృద్ది చేయడంలో విజయం సాధించింది. ఈ విజయాన్ని గుర్తిస్తూ పోస్టల్ స్టాంప్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి (Union Health Minister)మన్సుఖ్ మాండవియా( Mansukh Mandaviya)వర్చువల్ కార్యక్రమంలో విడుదల చేశారు. ఐసీఎంఆర్(icmr),మరియు దేశానికి చెందిన భారత్ బయోటెక్ (Bharat Biotech) వంటి ఔషద తయారి సంస్థ సంయుక్తంగా అభివృద్ది చేసిన స్వదేశీ కోవాక్సిన్(Covaxin)పై స్టాంప్ విడుదల చేయడం చాలా గర్వంగా ఉందన్నారు కేంద్రమంత్రి మాండవియ. స్వావలంబన భారత్ సాధనలో భాగంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)కలలను సాకారం చేసిన గొప్ప విషయమని ట్వీట్ (Tweet)చేశారు. కోవిడ్‌పై పరిశోధనలు జరిపేలా , దేశీయంగా టీకాను అభివృద్ది చేసేలా శాస్త్రవేత్తలను ప్రధాని ప్రోత్సహించారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కనుగొనడంలో తమ మేధాశక్తిని ఉపయోగించిన శాస్త్రవేత్తలందరికి అభినందనలు తెలిపారు కేంద్రమంత్రి మాండవియ. దేశంలో మానవ వనరులకు, మేధస్సులు లోట లేదన్నారాయన.
వైరస్‌కి విరుగుడు ..
సంవత్సర కాలంలో భారతదేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ సమర్దవంతంగా అత్యంత వేగంగా ఎలా నిర్వహించామనే విషయాన్ని కేంద్రమంత్రి వీడియో లింక్ ద్వారా టీకా వివరించారు. ఏడాది కాలంలో సుమారు 150 కోట్ల కంటే ఎక్కువ డోస్‌లను ప్రజలకు అందజేయడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదటి వార్షికోత్సవం సందర్బంగా 1,68,19,744 సెషన్ల కింద ఇప్పటివరకు 156.76 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించినట్లు పేర్కొన్నారు. గత 24 గంటల్లో, 66 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ డోసులు అందజేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
आज #1YearOfVaccineDrive के अवसर पर PM @NarendraModi जी के 'आत्मनिर्भर भारत' के सपने को साकार करते हुए, ICMR और भारत बायोटेक ने मिलकर जो स्वदेशी कोवैक्सीन विकसित की है, उस पर डाक टिकट जारी किया गया है।
వ్యాక్సినేషన్ రికార్డ్..
గతేడాది జనవరి 16వ తేదిని అందరూ గుర్తుంచుకోవాల్సిన దినంగా చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి మాండవియ. కేవలం సంవత్సర కాలంలో 157 కోట్ల కోవిడ్-19 వ్యాక్సినేషన్ మార్క్‌ను దాటినందుకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 'సబ్కా ప్రయాస్' మంత్రంతోనే నూతన భారతదేశం ఆవిర్భావం జరిగిందన్నారు. కరోనాను నిర్మూలించేందుకు జరిగిన పోరాటంలో భారత్ ప్రపంచ దేశాలకు ఓ ఆదర్శనంగా నిలిచిందన్నారు. ఇది దేశ ప్రజలందరి కృషిగా అభివర్ణించారు.
టాప్ ప్లేసులో తెలంగాణ..
రెండు డోసుల వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోస్‌లను కూడా పంపిణి చేస్తున్నామన్నారు కేంద్రమంత్రి. జనవరి 10నుంచి మొదలుపెట్టిన డ్రైవ్‌లో హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్స్, 60ఏళ్లు పైబడిన వారికి ముందు ప్రధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.అటుపై 18సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తామన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో తెలంగాణలో 5కోట్ల టీకాలను పంపిణి చేసింది. వందశాతం ఫస్ట్ డోస్ కంప్లీట్ చేసుకోగా..రెండో డోసు కూడా 75శాతం లక్ష్యాన్ని సాధించింది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.