Andhra Pradesh: నేడు నింగిలోకి PSLV C-50.. శాటిలైట్ ప్రత్యేకతలివే..!
ISRO to launch PSLV C-50 tomorrow
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నెల్లూరు జిల్లా(Nellore) లోని శ్రీహరికోటలో PSLV C-50 కౌంట్ డౌన్ మొదలైంది. దీని ద్వారా కమ్యూనికేషన్స్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపుతున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. PSLV – సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు కౌంట్ డౌన్ మొదలు పెట్టింది. PSLV C-50 ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-01ను స్పేస్ లో ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 17వ తేదీన మధ్యాహ్నం 3:41 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి గించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. CMS-01 ద్వారా దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని పరిమితి భారత్‌తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌కు విస్తరించనుంది. ఇప్పటికే ఈ ప్రయోగ పనులు పూర్తయ్యాయి. షార్ లోని రాకెట్ అనుసంధాన భవనంలో శాస్త్రవేత్తలు చివరి దశ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
ఇస్రో ఈ ప్రయోగం ద్వారా 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS 01ను నింగిలోకి వెళ్తోంది. మొత్తం ఏడేళ్ల పాటు కక్షలో తిరగనున్న ఈ శాటిలైట్ బరులు మొత్తం 1410 కిలోలు. ఇవాళ మధ్యాహ్నం 2గంటల 42 నిముషాలకు ప్రారంభమైన పీఎస్ఎల్వీ సీ-50 కౌంట్ డౌన్ 25 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగనుంది. రేపు సరిగ్గా 3గంటల 41 నిముషాలకు నిముషాలకు PSLV C-50 నింగిలోకి దూసుకెళ్తుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్ అని భారత అంతరిక్ష సంస్థ తెలిపింది.
రేపు రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో శాస్త్ర వేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.