ISRO: రెండు ప్రైవేట్ కంపెనీలతో ఇస్రో ఒప్పందం.. సంస్థకు రాకెట్స్ అందించనున్న స్టార్టప్స్

రాకెట్ల సరఫరా కోసం స్టార్టప్‌లతో ఇస్రో ఒప్పందం (PC: ISRO)

పీపీపీ పద్ధతిని ప్రకటించిన నెలలోనే ఇస్రోకు ఇప్పటి వరకు ప్రైవేట్ సెక్టార్ నుంచి 27 ప్రపోజల్స్ వచ్చాయి. దాంట్లో స్కైరూట్, అగ్నికుల్ వంటి సంస్థలు ఉన్నాయి.

  • Share this:
భారత స్పేస్ సెక్టార్‌ను కొత్త పుంతలు తొక్కించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO). ప్రఖ్యాత స్పేస్ మిషన్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకు ఇస్రో సవాల్ విసిరింది. ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, కొత్త టెక్నాలజీపై సంస్థ శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు. దీంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా స్పేస్ సెక్టార్‌లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్(పీపీపీ) (PPP) పద్ధతిలో స్పేస్ సెక్టార్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం అడుగులు వేసింది. ఈ క్రమంలో ఇస్రో తాజాగా రెండు స్టార్టప్‌లతో (Start Up) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థలు ఇస్రో అవసరాలకు అనుగుణంగా కొత్త తరం రాకెట్లను తయారు చేసి అందించనున్నాయి.

పీపీపీ పద్ధతిని ప్రకటించిన నెలలోనే ఇస్రోకు ఇప్పటి వరకు ప్రైవేట్ సెక్టార్ నుంచి 27 ప్రపోజల్స్ వచ్చాయి. దాంట్లో స్కైరూట్, అగ్నికుల్ అనే ప్రైవేట్ సెక్టార్ కంపెనీలతో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలు ఇస్రో కోసం రాకెట్స్, లాంచింగ్ వెహికల్స్ తయారు చేయనున్నాయి. “స్పేస్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలిచిన దేశాల జాబితాలో ఇండియా కూడా ఉంది. అత్యాధునికమైన స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడం పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తుంది ప్రైవేట్ ఎంటర్ ప్రైజెస్‌కు కూడా స్పేస్ సెక్టార్‌ను అందుబాటులో ఉంచి సంస్కరణలు చేపట్టడం ద్వారా ఇస్రో ఇంకా మరిన్ని విజయాలు సాధిస్తుంది” అని ఇస్రో చీఫ్ కే శివన్ అభిప్రాయపడ్డారు.

BCCI: క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. వారికి ఇకపై భారీగా జీతాలు.. పాత డిమాండ్లకు ఓకే


 ప్రపంచవ్యాప్తంగా స్పేస్ ఎకానమీ విలువ సుమారు 360 బిలియన్ డాలర్లు కాగా.. దాంట్లో భారత్ వాటా 2 శాతం మాత్రమే. ఇండియన్ స్పేస్ సెక్టార్ రాబోయే ఐదేళ్లలో కనీసం 50 బిలియన్ డాలర్లకు చేరుకోవాలన్నా.. 48 శాతం కాంపౌండ్ అగ్రెగేట్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) ఉండాల్సిందే. దాని కోసం.. ఇస్రో ఇంకా ఎన్నో గొప్ప రాకెట్లను ప్రయోగించాలి. అంతరిక్షానికి సంబంధించి సరికొత్త టెక్నాలజీని ఉపయోగించాలి. దానికోసం కచ్చితంగా ప్రైవేట్ సంస్థల సహాయం అవసరం.
అందుకే తాజా ఒప్పందం చేసుకున్నట్లు ఇస్రో ప్రకటించింది.


BCCI: బీసీసీఐకి షాక్ ఇచ్చిన తాలిబన్లు.. భారీగా ఆదాయాన్ని నష్టపోనున్న క్రికెట్ బోర్డు



 “ఈ కంపెనీలు ఇస్రోకు ఏవిధంగా ఉపయోగపడతాయి? రాకెట్ లాంచ్‌లో వీటి ద్వారా ఇస్రోకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఒప్పందం చేసుకుంటున్నాం. భవిష్యత్తులో మరికొన్ని కంపెనీలు కూడా ఇస్రోతో అగ్రిమెంట్ చేసుకోబోతున్నాయి..” అని ఇస్రో చైర్మన్ తెలిపారు. నిజానికి చాలా కంపెనీలు స్పేస్ మీద ప్రస్తుతం వర్క్ చేస్తున్నాయి. అంతరిక్షంపై పరిశోధనలు చేస్తున్నాయి. వెహికిల్స్ లాంచ్ చేయడం, శాటిలైట్స్ లాంచ్ చేయడం, ఇతర స్పేస్‌కు సంబంధించిన సర్వీసులను అందించడంలో ప్రైవేటు కంపెనీలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అందుకే.. పీపీపీ పద్ధతిలో ఇస్రోకు ఈ కంపెనీలు కావాల్సిన అవసరాలను తీర్చనున్నాయి. పీపీపీ ద్వారా కంపెనీలకు సంబంధించిన డీల్స్‌ను అటానమస్ నోడల్ ఏజెన్సీ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చూసుకుంటుంది.
Published by:John Naveen Kora
First published: