హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ISRO : ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతం..36 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి

ISRO : ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతం..36 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి

ఇస్రో బాహుబలి రాకెట్  LVM3-M2

ఇస్రో బాహుబలి రాకెట్ LVM3-M2

ISRO LVM3 M2 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 (GSLV MARK-3 దీనినే LVM3-M2 అని పిలుస్తారు)రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ISRO LVM3 M2 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 (GSLV MARK-3 దీనినే LVM3-M2 అని పిలుస్తారు)రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగికెగసిన ఈ రాకెట్ విదేశాలకు చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 19 నిమిషాల 7 సెకన్లలో ఈ ప్రయోగం పూర్తయింది. ప్రైవేట్‌ శాటి‌లైట్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ కంపెనీ అయిన వన్‌‌వె‌బ్‌కి చెందిన 36 బ్రాడ్‌‌బ్యాండ్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ ఉపగ్రహాలను ఈ రాకెట్‌ ద్వారా నిగిలోకి పంపించారు. యూకేకి చెందిన ఈ ఉపగ్రహాలన్నీ కలిపి 5,200 కిలోల వరకు బరువు ఉంటాయి. ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించడంతో యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్‌ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాగా, ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం గమనార్హం. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, యూకే-ఆధారిత నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ (వన్‌వెబ్ లిమిటెడ్) మధ్య వాణిజ్య ఏర్పాటులో భాగంగా ఈ మిషన్ నిర్వహించబడుతోంది.

ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో సైంటిస్టులంతా హర్షం వ్యక్తం చేశారు. మాకు దీపావళి సంబరం ముందే మొదలైపోయింది.. 16 శాటిలైట్లను దిగ్విజయంగా సెపరేట్ చేయగలిగాం.. మిగతా 20 ఉపగ్రహాల గురించి డేటా అందాల్సి ఉంది అంటూ ట్వీట్ చేశారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. దాదాపు 43.5 మీటర్ల పొడవైన రాకెట్‌ ప్రయోగం ఇదేనని ఇస్రో చైర్మన్‌ తెలిపారు. 5,796 కిలోల వరకు పేలోడ్ ని మోసుకెళ్లే మొదటి భారతీయ రాకెట్‌గా అవతరించింది. ఇది మూడు-దశల రాకెట్, ఇందులో రెండు సాలిడ్ మోటారు స్టెప్పులు ఉంటాయి. లిక్విడ్ ప్రొపెల్లెంట్ కర్ స్టేజ్, మధ్యలో క్రయోజెనిక్ స్టేజ్ ఉంటాయి. ఈ భారీ రూపం కారణంగా దీనిని ఇస్రో యొక్క బాహుబలి అని కూడా పిలుస్తారు. LVM3-M2 మిషన్ ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్ స్పెస్ ఇండియా లిమిటెడ్ కోసం మొదటి అంకితమైన వాణిజ్య మిషన్ అయినందున ఈ ప్రయోగం ఇస్రోకి ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Shocking : హెల్త్ సెంటర్ లో నర్సుపై సామూహిక అత్యాచారం..కట్టేసి గొంతు బిగించి దారుణంగా..

యూకేకు చెందిన 108 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, అందులో భాగంగానే ఇప్పుడు 36 ఉపగ్రహాలను పంపించామని తెలిపారు. 36 వన్‌వెబ్ ఉపగ్రహాలతో కూడిన మరో సెట్‌ను వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎల్‌విఎం3 ప్రయోగించనున్నట్లు ఆయన తెలిపారు. కమర్షియల్ శాటిలైట్ మార్కెట్‌లో మరో అడుగు ముందుకేశారంటూ శాస్త్రవేత్తల్ని అభినందించారు ప్రధాని మోదీ . యూకేతో జరిగిన ఒప్పందం ప్రకారం వచ్చే మార్చిలోగా మరో ఆరు ప్రయోగాలు చేయనుంది ఇస్రో.

First published:

Tags: ISRO

ఉత్తమ కథలు