ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో (ISRO) చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలైంది. ఒక ప్రైవేట్ రాకెట్‌ను ఇస్రో, షార్ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఒకప్పుడు సైకిళ్లపై రాకెట్ విడి భాగాలను తీసుకెళ్లిన ఇస్రో.. ఇవాళ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా.. ప్రైవేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. దీనివల్ల రోదసీ వాణిజ్యంలో ఇస్రో మరో భారీ అడుగు వేసినట్లయ్యింది. రాకెట్ అనుకున్న ప్రకారమే నింగిలోకి దూసుకెళ్లడంతో... షార్‌లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి.
హైదరాబాద్ లోని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సొంతంగా విక్రమ్-S రాకెట్ తయారుచేసింది. దాన్ని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - షార్ (SDSC - SHAR) నుంచి నేటి ఉదయం 11:30 గంటలకు నింగిలోకి పంపారు. ప్రైవేట్ రంగంలో ఇది మొదటి ప్రయోగం కాబట్టి దీన్ని ప్రారంభ్ మిషన్ అని పిలుస్తున్నారు. దీన్ని విజయవంతం చేయడం ద్వారా ఇస్రో.. చరిత్రలో మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించినట్లు అయ్యింది
????????India's 1st-ever private launch of Vikram Suborbital rocket takes place at Satish Dhawan Space Centre, Sriharikota.
▪️ This mission is milestone in history of ISRO. A non govet entity, Start up Skyroot Aerospace Pvt Ltd had developed the single stage Vikram Suborbital rocket. pic.twitter.com/2F6IkUfGHM — All India Radio News (@airnewsalerts) November 18, 2022
రాకెట్ ప్రయోగ విశేషాలు :
భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయికి నివాళిగా రాకెట్‌కు విక్రమ్-S’ అని పేరుపెట్టారు. ఇది 545 కేజీల బరువు ఉంటుంది. అంటే దాదాపు 3 బైకులతో సమానం. రాకెట్ పొడవు 6 మీటర్లు. ఇది నింగిలో 81.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తుంది. తర్వాత యూటర్న్ తీసుకొని.. శ్రీహరికోటకు 115 కిలోమీటర్ల దూరంలో.. సముద్రంలో పడిపోయింది. ఈ రాకెట్ ద్వారా 3 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపారు. వాటిలో ఒకటి చెన్నైలోని ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్‌కిడ్స్ తయారుచేసిన 2.5 కేజీల శాటిలైట్ ఫన్-శాట్ కాగా.. మిగతా రెండూ విదేశీ శాటిలైట్లు.
భారీగా ఆదాయం :
ఇస్రో ఇప్పటికే విదేశీ శాటిలైట్లను నింగిలోకి పంపడం ద్వారా భారీగా ఆదాయం పొందుతోంది. దీన్ని మరింత విస్తరించే క్రమంలో ప్రైవేట్ రాకెట్లను కూడా ప్రయోగించేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంది. తొలి ప్రయోగం విజయవంతం అవ్వడంతో.. ఇక అంతరిక్షమే హద్దుగా అడుగులు పడనున్నాయి. ప్రధానంగా.. షార్ నుంచి రాకెట్లను నింగిలోకి పంపేందుకు అత్యంత అనువుగా ఉంటుంది. భూమిపై అలాంటి పరిస్థితులు నాలుగైదు చోట్లే ఉన్నాయి. అందువల్ల ఇస్రో.. ఈ దిశగా ప్లాన్ వేసుకొని ముందుకెళ్తోంది. అటు స్పేస్ సైన్స్‌లో పరిశోధనలకు దాదాపు 100 స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థలు శాటిలైట్లు, రాకెట్లు, ఇతర విడి భాగాలను తయారుచేయనున్నాయి. అందువల్ల భవిష్యత్తులో ఇస్రో వాణిజ్య పరంగా దూసుకుపోవడం ఖాయం. ఇదే ఉత్సాహంలో చంద్రయాన్-3 మిషన్‌ను మరికొన్ని నెలల్లో ప్రారంభించేందుకు ఇస్రో రెడీ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ISRO