హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Womens Day 2020 | ఇస్రో సైంటిస్ట్ అనురాధ సక్సెస్ స్టోరీ..

Womens Day 2020 | ఇస్రో సైంటిస్ట్ అనురాధ సక్సెస్ స్టోరీ..

అనురాధ

అనురాధ

Womens Day 2020 : అనురాధ టీ.కే... ప్రఖ్యాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)లో స్పెషలైజ్‌డ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ విభాగానికి డైరెక్టర్ ఈమె. జీశాట్12, జీశాట్ 10 ఉపగ్రహ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. ఇస్రోలోనే సీనియర్ మోస్ట్ మహిళా సైంటిస్ట్. 1982లో ఇస్రోలో చేరిన అనురాధ.. తొలి మహిళా శాటిలైట్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈమె 1961లో జన్మించారు. బెంగళూరులోని యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో బ్యాచిలర్స్ పట్టా పొందారు.

ఇంకా చదవండి ...

అనురాధ టీ.కే... ప్రఖ్యాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)లో స్పెషలైజ్‌డ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ విభాగానికి డైరెక్టర్ ఈమె. జీశాట్12, జీశాట్ 10 ఉపగ్రహ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. ఇస్రోలోనే సీనియర్ మోస్ట్ మహిళా సైంటిస్ట్. 1982లో ఇస్రోలో చేరిన అనురాధ.. తొలి మహిళా శాటిలైట్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈమె 1961లో జన్మించారు. బెంగళూరులోని యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో బ్యాచిలర్స్ పట్టా పొందారు. టెలికం, డేటా లింక్స్‌కు సంబంధించి అత్యంత కీలకమైన జియో సింక్రనస్ శాటిలైట్స్ విభాగంలో పని చేశారు. 2011లో ప్రయోగించిన జీశాట్ 12 ఉపగ్రహ ప్రయోగంలో ఈమె పాత్ర అమోఘం.

జీశాట్9, జీశాట్17, జీశాట్18 కమ్యూనికేషన్ శాటిలైట్స్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు అనురాధ. తన ఘనతలపై ఆమె మాట్లాడారు. భారత అంతరిక్ష పరిశోధనకు ఆధ్యుడు విక్రమ్ సారాభాయ్‌ను గుర్తు చేసుకుంటూ.. ఆయన అంతరిక్ష రంగంలో విత్తనం వేశారని, ఆ సైన్సును అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని అన్నారు.

First published:

Tags: ISRO, Womens Day 2020

ఉత్తమ కథలు